–హర్షం వ్యక్తం చేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్
President Srinivas : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో విధులునిర్వహిస్తున్న 1484 మంది గోపాలమిత్రలకు ఆరు నెలల వేతన బకాయిల చెల్లింపుల కోసం రూ.9.50 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు విషయాన్ని స్వయంగా వివరించి వేతనాలు విడుదల అయ్యేందుకు కృషి చేసిన.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ కూమార్ సుల్తానియా, పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోస్, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, సిఈఓ డాక్టర్ మల్లీశ్వరికి, ఈ సందర్భంగా రాష్ట్ర గోపాలమిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెరకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సమస్యల తో సతమతం అవుతున్న మాకు వేతనాలు విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.