District Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీవెన, సూర్యాపేట : జవహర్ నవోదయ విద్యాలయంలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శనివారం సూర్యాపేట పట్టణంలోని రెడ్డి హాస్టల్ నందు ఏర్పాటుచేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం అవుతుంది కాబట్టి విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన బెంచీలు, త్రాగు నీరు కొరకు ఆర్వో ప్లాంట్, వంట గది, వంట సామాగ్రి,డైనింగ్ హాల్, టాయిలెట్స్,అలాగే లైబ్రరీ కొరకు టేబుల్స్ లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు,డి ఈ ఓ అశోక్,తహసీల్దార్ కృష్ణయ్య,జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్,తెలంగాణ రాష్ట్ర విద్యా మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డి ఈ రమేష్, ఏ ఈ ఓబుల్,అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.