–డాక్టర్ నందిని సిధారెడ్డి
Dr. Nandini Sidha Reddy : ప్రజాదీవెన నల్గొండ : సమాజాన్ని అధ్యయనం చేయకుండా కవిత్వం రాయడం వల్ల సరైన కవిత్వం రాదు. యువకులు సమాజంలోని అనేక విషయాలపై దృష్టి సాధించాలని అక్షరాన్ని ఆయుధంగా మార్చుకొని సమాజాన్ని సంస్కరించడానికి తమ వంతు కర్తవ్యం నిర్వహించాలని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ యుటిఎఫ్ భవన్ లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో సాహిత్య మేళ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు యువ కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ విద్యార్థులు, 30 మంది కవులు సభలో కవితా పఠనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు. యువతరం సాహిత్యంలో రాణించాలని పిలుపునిచ్చారు. మరో అంశం శ్రీశ్రీ మహప్రస్థానం పుస్తక పరిచయం పై కవి రచయిత మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి మాట్లాడుతూ మహాప్రస్థానం యువకులకు లాంగ్ మార్చ్ లాంటిదని, కుల మత ఎల్లలు దాటి శ్రామిక జన సమూహంగా ఉద్యమించినప్పుడే సమ సమాజం వస్తుదని అన్నారు.
అదే శ్రీ శ్రీ కళని ఆ కలని ఆశయాన్ని అక్షయకరించి జలపాతం లాంటి ధ్వనితో గేయాలు రాసి ప్రజల చేతికి ఆయుధంగా అందించారని అన్నారు. ప్రముఖ మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ కవిత్వం, గేయాలు ఎందుకు రాయాలి, ఎలా రాయాలి వస్తువుని ఎలా తీసుకోవాలో తెలియజేశారు. డాక్టర్ పగడాల నాగేందర్ మాట్లాడుతూ యవ్వనంలో యువకులు ప్రధమంగా రాసేది ప్రేమ కవిత్వమేనని ఆ తర్వాత అది సామాజిక విలువల వైపు తీసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్రా ప్రవీణ్ రెడ్డి, బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి, పేరుమాళ్ల ఆనంద్, ఏభూషి నరసింహ, బైరెడ్డి కృష్ణా రెడ్డి, యోగా గురువు మాద గాని శంకరయ్య, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, యన్. బీమార్జున్ రెడ్డి, సృజన సాహితి ప్రధాన కార్యదర్శి డా.సాగర్ల సత్తయ్య, తెలంగాణ సాహితి జిల్లా ఉపాధ్యక్షులు బూర్గు గోపి కృష్ణ, కార్యదర్శులు పుప్పాల మట్టయ్య, బండారు శంకర్, టి. ఉప్పలయ్య, పగిడిపాటి నరసింహ, గేర నరసింహ, ఆందోజు నాగభూషణం, దాసరి ప్రభాకర్, దాసరి శ్రీరాములు పాల్గొన్నారు.
–సత్కారం….
అనంతరం యువ కవులకు ముఖ్య అతిథులు జ్ఞాపిక, మహాప్రస్థానం పుస్తకాన్ని బహుకరించి సత్కరించారు. అనంతరం సాహితి సదస్సులో ప్రముఖ సామాజిక సేవకులు డా. అదంకి కృష్ణమాచార్యులు ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. యువ కవి సమ్మేళనంలో కవితా పఠనం సందర్భంగా ఉత్తమ కవితలను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ నగదు బహుమతులను అందజేసి సత్కరించారు.