CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రైజింగ్-2047 విజన్‌కు అను గుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెం టర్స్ (ATC) రూపుదిద్దుకో వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. నిర్దేశిత స మయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు.
ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగ తిపై డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స చివాలయంలో ముఖ్యమంత్రి మం త్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఉ న్నతాధికారుల సమావేశంలో సమీ క్షించారు. ఈ సందర్భంగా “ఏటీసీ లు తెలంగాణ యువతకు అత్యా ధునిక శిక్షణా సంస్థలు” అన్న పేరు తో రూపొందించిన పోస్టర్‌ను ఆవి ష్కరించారు.మారుతున్న పరిస్థితు లు, పరిశ్రమల అవసరాలకు అను గుణంగా కోర్సులు, శిక్షణ అందించే లా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. రాష్ట్రంలోని ఐటీఐలను AT C లుగా మార్చడంలో జరుగుతు న్న అభివృద్ధి, పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను వివ రాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు దశల్లో 111 ATC లను అభివృద్ధి చేపట్టిన ట్టు అధికారులు వివరించారు. అం దులో మొదటి దశలో 25, రెండో దశలో 40, మూడో దశలో 46 ఏటీ సీలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మొదటి రెండు దశలకు సంబంధించి ఇప్పటికే 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని తెలి పారు. ఏటీసీలను వీలైనంత తొంద రగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్య మంత్రి సూచించారు. జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఆక స్మిక తనిఖీలు నిర్వహిస్తానని చె ప్పారు.
అలాగే, జినోమ్ వ్యాలీలో ఒక మో డల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ప రిశ్రమల అవసరాలకు తగినట్టుగా శిక్షణ అందించే కోర్సులను అక్కడ నిర్వహించాలని చెప్పారు. అందు కు అవసరమైన స్థలాన్ని కేటాయిం చడంతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాద నలను తయారు చేయాలన్నారు.