Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Journalists Unity : బిసి జర్నలిస్టులు ఏకంకావాల్సిన సమయం ఆసన్నం

–ప్రభుత్వం స్పందించి జర్నలిస్ట్ కో టా కింద ఎమ్మెల్సీ నీ ఏర్పాటు చేయాలి

–భవిష్యత్ కార్యాచరణ కు బీసీ జర్నలిస్ట్ జే.ఏ.సి ఏర్పాటు

— మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్

BC Journalists Unity : ప్రజా దీవెన, హైదరాబాద్: బిసి జర్నలిస్టులు ఏకం కావాలని బిసి జర్నలిస్టులు ఫోరం జె.ఎ.సి నాయ కులు పిలుపునిచ్చారు. బిసి జనా భా దామాషా ప్రకారం ప్రభుత్వం స్పందించి జర్నలిస్ట్ కోటా కింద ఎ మ్మెల్సీ నీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బిసి జర్నలిస్టుల భవిష్యత్ కార్యాచరణ కు బీసీ జర్నలిస్ట్ జే.ఏ.సి ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. బుధవారం హైదరా బాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తె లంగాణ రాష్ట్ర బిసి జర్నలిస్టు జే. ఏ.సి అధ్వర్యంలో బిసి జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంతో పాటు భవి ష్యత్తు కార్యాచరణ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు బిసి జర్నలిస్టు నాయకులు పా ల్గొన్నారు.మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం, తెలంగాణ రాష్ట్ర గౌడ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు సప్తగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శి వి.శివ కృష్ణ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్,

యాదవ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కృష్ణ, అమర్, పద్మశాలి జర్నలిస్టు సంఘం అధ్యక్షులు వీరు మాట్లాడుతూ బిసి జర్నలిస్టు లు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. రాజకీయ నాయకులకు సలహాలు సూచనలు ఇచ్చే జర్నలిస్టులు మన బాగు గురించి నిర్ణయాలు తీసుకోవడం లేదు అని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే బిసి ల అందరిని గెలిపించు కోవాలని పిలుపు నిచ్చారు. అలాగే మన కోసం చట్ట సభల్లో మన గొంతు వినిపించడానికి జర్నలిస్ట్ కోట కింద ఎమ్మెల్సీ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇంకా కొద్ది నెలల్లో రెండు సంవత్సరాలు కాలం ముగుస్తుంది కావున కాల పరిమితి అయిపోగానే బిసి జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ కేటాయించాలి అని డిమాండ్ చేశారు. బీసీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలు ప్రైవేటు కళాశాలలో 50% రాయితీ కల్పించాలని,ఇలా అనేక రకమైన విషయాలపై జర్నలిస్టుల సమస్యలపై, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, అక్రిడేషన్ కార్డు, మరియు హెల్త్ కార్డు, ఇన్స్యూరెన్స్, ఉచిత వైద్య సౌకర్యం, చిన్నతరహా పత్రికలు మరియు యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో ప్రభుత్వం గుర్తించి అక్రిడేషన్ కేటాయించాలని ఏబిసిడి వర్గీకరణ తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు డాక్టర్ జానకిరామ్ సిఆర్, వెంకటేష్ దాడే, గడ్డం ప్రశాంత్ కుమార్, బోయిన్ శ్రీనివాస్, మల్లేష్, సుగ్రీవుడు, బంటు, సైదులు, వేణు గోపాల్, కిరణ్, సత్యనారాయణ, తోపాటు అన్ని బిసి సంఘాల జె.ఏ.సి జర్నలి స్టు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.