TUWJ Leaders : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని సమస్త జర్నలిస్టులకు ఎయిమ్స్ లో ప్రత్యేక సదుపాయాల తో కూడిన ఉచిత వైద్యాన్ని అందు బాటులోకి తెచ్చి ఆరోగ్య భద్రత క ల్పించాలని తెలంగాణ యూనియ న్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు కేంద్ర బొగ్గు,గనుల శా ఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి విన తి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం డిల్లీ లోని ఆయన నివాసంలో జరి గిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నే తృత్వంలో సంఘం నాయకులు భే టీలో ఈ మేరకు అప్పీల్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టు హెల్త్ కార్డులు(JHS) కేవలం నిమ్స్ లో మాత్రమే చెల్లుబాటు అవుతున్నా యని, గతంలో కార్పొరేట్ ఆసుప త్రుల్లో సైతం ఈ క్యాష్ లెస్ హెల్త్ కార్డులను అనుమతించేవారని అ యితే ప్రస్తుతం కొన్ని లిమిటెడ్ ఆ సుపత్రుల వారు, నిమ్స్ ఆసుపత్రి వారు మాత్రమే వీటిని అనుమ తి స్తున్న విషయాన్ని ఆయనకు వివ రించారు. అయితే రాష్ట్రంలో దాదా పు 23 వేల మంది అక్రిడిటేటెడ్ జ ర్నలిస్టులు ఉన్నారని వీరి సౌలభ్యం కోసం భువనగిరిలో గల ఆల్ ఇండి యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( ఎయిమ్స్) లో ఈ హెల్త్ కా ర్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చూడటంతో పాటు కొన్ని ప్రత్యేక వ సతులు కల్పించే విధంగా కేంద్ర ప్ర భుత్వాన్ని ఒప్పించాలని కోరారు.
ఈ విషయమై వెంటనే సానుకూ లంగా స్పందించిన మంత్రి తనకు ఇప్పటికే ఈ విషయంలో ఒక ఆలో చన ఉన్నదని, జర్నలిస్ట్ లతో పా టు దివ్యాంగులకు కూడా ఎయిమ్స్ లో ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా త్వరలోనే సంబం ధిత కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణ యం తీసుకుంటామన్నారు.
మంత్రి తో భేటీ అయిన వారిలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి యో గానందం, ఐజేయూ జాతీయ కార్య వర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, ఢి ల్లీ అధ్యక్షుడు నాగిల్ల వెంకటేష్, జా తీయ కౌన్సిల్ సభ్యులు తిరుపతి నాయక్, నేతలు కొన్నోజు రాజు, మే క గోపికృష్ణ, ముక్కాల సతీష్, రా జ్ కుమార్ గుజరాతి, పబ్బా సురేశ్ పాల్గొన్నారు.