ShadnagarAccident: ప్రజా దీవెన, హైదరాబాద్: అనుకోని సంఘటనలు, ప్రమాదాలు కుటుంబాలు కుటుoబాలనే సర్వ నా శనం చేస్తాయoటే ఇదేనేమో… ఒక్కోసారి అలాంటి ప్రమాదాల గు రించి తెలిసి ఆలోచిస్తే అంతా శూన్యమే అనిపించక మానదు. పై విషయాలకు సరితూగే హృదయ విదారక సంఘటన ఒకటి రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ ( Shadnagar) పట్టణ చౌరస్తాలో శని వారo పొద్దుపొద్దునే చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఈ ఘోరరోడ్డుప్రమాదం జరి గి తండ్రికూతుళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్ నగర్ చౌ రస్తాలో శనివారం ఉదయం ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ ఇస్తు న్న ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి త న ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్య క్తికి ఇచ్చి తన వాళ్ల కు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడి వారి నందరిని కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్ల కు తయ్యబ్ సమాచారం తెలియజేశారు.
లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అ దుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా తం డ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని తెలిపారు. డ్రైవర్ పోలీసుల అ దుపులో ఉన్న ట్టు తెలిపారు. అదే విధంగా మచ్చేందర్ తన కూ తురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి (vardhamaan college) పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసు కుందని సిఐ తెలిపారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మా ర్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు.