Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IAS IlaThipathi, IPS SharathChandraPawar : విద్యార్ధులకు నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీల హితబోధ, ఉన్నతచదువులతో అత్యున్నత జీవితం

 

IAS IlaThipathi, IPS SharathChandraPawar:    ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ప్రతీ ఒ క్కరూ జీవితంలో ఉన్నత స్థానం లో స్థిరపడాలంటే ఉన్నత చదువుకో వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి చెప్పారు. చదువుతోపాటు క్రీడలు, స్విమ్మింగ్ రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. శనివారం ఆమె జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవా ర్ తో కలిసి నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి లోని మహా త్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యా ర్ధులకు ఒత్తిడులను జయించి చ దువులో ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో వేర్వేరుగా హితబోధ చేశారు.

ముందుగా కళాశాలలో విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులు, వి ద్య, భోజనం తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మా ట్లాడారు. చదువు తో పాటు, విద్యార్థులకు క్రీడలు అ వసరమని, అంతేకాక రన్నింగ్ స్వి మ్మింగ్ అన్నింటిలో ప్రవేశం ఉండాలని, అ ప్పుడే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధిస్తారని చెప్పారు.కష్టపడి చదివితేనే జీవితంలో ఉ న్నత స్థానంలో ఉంటారని , అం దువల్ల చదువు పైన దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు లోనుకావద్ద న్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మా ట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సా ధించేందుకు విద్యార్థులు ఒక ప్రణా ళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, ల క్ష్యసాధనకు ప్రణాళికతో పాటు, గొప్ప వారిని ఆదర్శం గా తీసుకోవాలని, కష్టపడి పని చేయడం, లక్ష్యసా ధన పైనే దృష్టి సారించడం వంటివి చేయాలన్నారు. ముఖ్యంగా విద్యా ర్థులు చెడు అలవాట్లకులోను కావ ద్దని, ప్రత్యేకించి డ్రగ్స్, మద్యం, సిగరెట్ తది తర వాటి జోలికి వెళ్ళవద్దని అన్నారు.

చెడు అలవాట్ల కార ణంగా కేసు నమోధైతే దాని నుంచి బయట ప డడం కష్టమని, భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం సాధించినప్పుడు పోలీసు ద్వారా చేసే వెరిఫికేషన్ సమయం లో ఇవన్నీ అడ్డువస్తా యని, అందు వల్ల ఎట్టి పరిస్థితు లలో చెడు వైపు వెళ్ళవద్దని అ న్నారు. ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెండాడు తుందని, దానికి శిక్ష అనుభవించా ల్సి వస్తుందని చెప్పారు.బాగా చదువు కునేందుకు జిల్లా యంత్రాంగం త రుపున ఎలాంటి చేయూత కావా లన్నా కూడా అందిస్తామని తెలిపారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.