Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMRevanthReddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, సైద్ధాం తిక రాజకీయాలుపోయి మేనేజ్మెంట్ పాలిటిక్స్ కీరోల్ ప్లే చేస్తున్నాయ్

 

CMRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ రాజ కీ యాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి, మేనేజ్మెంట్ పాలిటిక్స్ కీరో ల్ ప్లే చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి నే డు స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయన్నారు. కార్యక ర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వ స్తోందని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్ కు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో యూని వర్సిటీలలో విద్యార్థి రాజకీయలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవ సరం ఉందని, ప్రతిప క్షాలు సహేతుకమైన సూచన చేస్తే తీసుకోవ డానికి మాకు ఇబ్బంది లే దని రేవంత్ స్పష్టం చేశారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వ రకు శాసనసభ నుంచి ఎవరినీ స స్పెండ్ చేయలేదని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం జైపాల్ రె డ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలపై కూలంకషంగా మాట్లాడారు.

దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక నిలువెత్తు శిఖరమని కొనియా డిన రేవంత్ రెడ్డి పీవీ, జైపాల్ రెడ్డి లాం టి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీ యాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ‘విద్యార్థి నాయకుడిగా, శాసన స భ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రి గా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి ప ని చేసి, దేశానికే తలమానికమైన పనులు చేశారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో స్వర్గీయ జైపాల్ రెడ్డి గొప్పతనం గురించి సీఎం రే వంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే… ’19 69 లో తొలిసారి కల్వ కుర్తి నియోజ కవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు శాసనస భ్యుడిగా, 5 సార్లు లోక్ సభ సభ్యు డిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడి గా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెట్రోలి యం శాఖ నిర్వహిస్తున్న సమ యంలో ఎన్నో సంస్కరణలు తీసు కొచ్చా రు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భా రతి చట్టాన్ని దేశానికి అందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

పార్లమెంట్ లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితో నూ జైపాల్ రెడ్డితో వ్యక్తిగత వైరం లేదు. ఉత్తమ పార్ల మెంటేరియన్ గా దేశ రాజకీయాల్లో బలమైన ము ద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి. చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరి ష్కారానికి ఆయన కృషి చేశారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై జైపాల్ రెడ్డి ఎక్కువ ఆ లోచించేవారు. ఆయన ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశా రు. రాజకీయాలలో ధనప్రవాహం తగ్గిం చాలని ఆయన ప్రయత్నించారు.

తెలంగాణ ఏర్పాటులో ఆయన పా త్ర లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చే ది కాదు. చర్చ లేకుండానే పార్లమెం ట్ లో తెలంగాణ బిల్ ఆమోదించే లా జైపాల్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి చొరవతోనే తె లంగాణ ఏర్పాటు చేశామని సోనియాగాంధీ ఒక సం దర్భంలో నాతో చెప్పారు. కాంగ్రెస్ ను  వీడినా, తిరిగి కాంగ్రెస్ లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.