Collector Tejas Nandlal Pawar : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య, సన్నబి య్యం, రేషన్ కార్డులు పంపిణిలో సూర్యాపేటకు ప్రత్యేక స్థానం
Collector Tejas Nandlal Pawar :
ప్రజా దీవెన సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హు జూర్నగర్ నుండి సన్నబియ్యం పం పిణి, తిరుమలగిరి నుండి నూతన్ రేషన్ కార్డులు పంపిణి చేయటం మన జిల్లా అదృష్టం అని జిల్లా కలె క్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొ న్నారు. సన్నబి య్యం, రేషన్ కార్డు లు పంపిణిలో సూర్యాపేటకు ప్ర త్యేక స్థానం లభించిందని గుర్తు చేశారు. ఆదివారం కలెక్టరేట్ కార్యా లయ సమావేశం మందిరంలో సూ ర్యాపేట శాసన సభ్యులు గుంట కం డ్ల జగదీష్ రెడ్డి, తెలంగాణ పర్యా టక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నం ద్ లాల్ పవార్ సూర్యాపేట మండ లంకి చెందిన వారికి నూతన రేషన్ కార్డులు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో ఇప్పటి వరకు 322 74 నూతన రేషన్ కార్డులు మంజూ రు చేయటం ద్వారా కొత్తగా 9530 9 మందికి సన్నబియ్యం పొందే హ క్కు లభించిందని అలాగే ఈరోజు సూర్యాపేట మండలంలో 4016 నూతన కార్డుల ద్వారా 12193 మందికి సన్నబియ్యం పంపిణి అ ర్హత లభించిందని, అలాగే ఇప్పటికే ఉన్న 8008 కార్డులలో 11930 అ దనంగా చేర్చి మందికి కొత్తగా అవ కాశం కల్పించటం జరిగిందన్నారు. రేషన్ కార్డులు రాని వారు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేద ని కొత్త కార్డు కొరకు మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని తదుపరి అర్హత ఉంటే తహసీల్దార్ పరిశీలిం చి పౌర సరఫరాల శాఖ ద్వారా కా ర్డు మంజూరు చేస్తారని తెలిపారు. రేషన్ డీలర్లు పేదవారికి సన్నబి య్యం పంపిణిలో కీలక పాత్ర పోషిం చాలన్నారు.
తెలంగాణ పర్యాటక సంస్థ కార్పొ రేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మా ట్లాడుతూ పేదవారి ఆత్మ గౌరవనికి రేషన్ కార్డులు చిహ్నం అని మన జి ల్లా నుండే సన్నబియ్యం పంపిణి, నూతన్ రేషన్ కార్డులు మంజూరు చేసినందుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదములు తెలుపుతూ దేశం లోని ఎ నాయకుడికి రాని ఆలోచన ధనవంతులతో పాటు పేదవారు స న్న బియ్యం తినాలని మన ము ఖ్యమంత్రికి, మంత్రికి రావటం వారి గొప్పతనం అని కొనియాడినారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని గతంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఉన్నప్పుడు 20 లక్షల ఇల్లు లు నిర్మించారాని మరల ఇప్పుడు నియోజవర్గానికి 3500 చొప్పున మొత్తం ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఇల్లులు నిర్మిస్తున్నామని తెలి పారు.
సూర్యాపేట శాసన సభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అ ర్హత కలిగిన వారందరికీ నూతన రే షన్ కార్డులు ఇవ్వటం అలాగే సన్న బియ్యం ఇవ్వటం చాలా సంతోషం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు లో ఎంతమంది ఉన్న నలు గురికి మాత్రమే 4 కేజీ ల చొప్పున ఇచ్చారని తెలంగాణ ఏర్పడిన త ర్వాత కార్డులో ఉన్న అందరికి 6 కే జీ ల చొప్పున ఇచ్చామని తెలిపా రు.రాజేంద్రనగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా తయారు చే సిన ఆర్ ఎన్ ఆర్ ధాన్యం సేకరించి నాణ్యమైన సన్నబియ్యం పంపిణి చేయాలని సూచించారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసాక అన్ని అ మలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పి రాంబాబు,ఆర్డీఓ వేణుమాధవ రావు,గ్రంధాలయ సంస్థల చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ చై ర్మ న్ కొప్పుల వేణారెడ్ది, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్,డి ఎస్ ఓ మోహన్ బాబు,తహసీల్దార్ కృష్ణయ్య, అధి కారులు, సిబ్బంది తదితరులు పా ల్గొన్నారు.