–సిఐటియు
CITU : ప్రజాదీవెన నల్గొండ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య భవన్లో రాడ్ బైండింగ్ బ్యాచ్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో 18 రకాల కార్మికులు పనిచేస్తున్నారని వారికి ప్రభుత్వం అనేక సంవత్సరాల కార్మికుల పోరాట ఫలితంగా ఏర్పాటుచేసిన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. లేబర్ ఆఫీసులో అధికారులు ఉద్యోగుల పోస్టులు ఖాళీలు ఉండడం ద్వారా కార్మికులకు అందవలసిన సంక్షేమ పథకాలు సకాలంలో అందడం లేదని అన్నారు. వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ద్వారా 50 సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ నెలకు 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా ఆరు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని వివాహ ప్రసూతి కానుకలు 30 వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లల విద్యాభివృద్ధి కోసం స్కాలర్షిప్లు ఇవ్వాలని కార్మికులకు బైకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాచ్ వర్కర్ల కూలి రేట్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచుకోవడానికి సంఘటితంగా ఏర్పడి యూనియన్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు.
–కమిటీ ఎన్నిక…
అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు తాడోజు నాగాచారి, కార్యదర్శి కారం స్వామి, కోశాధికారి సింగం పిచ్చయ్య, ఉపాధ్యక్షులు తిరుపారి సైదులు, సహాయ కార్యదర్శి మేడిశెట్టి సతీష్, కార్యవర్గ సభ్యులు కత్తుల శంకర్, కొత్తపెళ్లి గోవిందు, సతీష్, దొరేపల్లి సైదులు, చింత అనిల్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలివోజు సైదాచారి, అద్దంకి నరసింహ, ఎస్కే మదర్, నాగేంద్ర చారి, మహమ్మద్, రాజేష్, కత్తుల అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.