Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kacham Krishnamurthy : భూస్వాములను తరిమిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి

Kacham Krishnamurthy : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నాటి భూస్వాములను నిజాం రజాకారులను తరిమిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ అన్నారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో కాచం కృష్ణమూర్తి 19వ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రజల కోసం అనేక ఆటుపోట్లు, నిర్బంధాలను అధిగమించి పీడిత ప్రజల పక్షాన నిలిచి మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సముచిత పాత్రను పోషించారని అన్నారు. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మెలకువగా చాకచక్యంగా వ్యవహరించడంలో బహు నేర్పరి. ఐలమ్మ భూ పోరాటం, దొడ్డి కొమురయ్య నేలకొరిగిన ఉదాంతం నుంచి కృష్ణమూర్తి కార్యాచరణ ముమ్మురమైందని పేర్కొన్నారు. బాంచన్ దొర కాల్మొక్త అనే బక్కచిక్కిన పేదలతో బంధుకులు పట్టించి దొరలను, జాగిందారలను తరిమి కొట్టి దున్నేవాడికి భూమిని పంచి వేలాది గ్రామాల ప్రజలను విముక్తి చేసి, కూలి పోరాటాలకు నాయకత్వం వహించి గ్రామీణ పేదలకు వ్యవసాయ కూలీలకు అండగా నిలిచారని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తుందని దేశాన్ని కార్పోరేట్ శక్తులకు దారదత్వం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నినీరుగారుస్తుందని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేటితరనికి కృష్ణమూర్తి జీవితం ఆదర్శమని. వారు నడిచిన పోరుబాటలో ప్రజలను చైతన్యం చేస్తూ కష్టజీవుల రాజ్య స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం భిక్షం, మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తెలకపల్లి శ్రీను, విజయ్ మధు శంకర్ రాములు తదితరులు పాల్గొన్నారు.