BRSKTR: ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (ktr) వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదే శించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిం దితురాలు కొండా సురేఖపై (minister konda Surekha) ఆగస్టు 21, 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీ సుజా రీ చేయాలన్న కోర్టు తీర్పు వెలువరించింది.
కేటీఆర్‌పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీ ఆర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, డా క్యుమెంట్లను పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సు రేఖ పై కేసు నమోదుకు ఆదేశించింది.