District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, ఇం డ్లు నిర్మించుకునే ఆర్థికస్థోమత లేని వారి జాబితాలే పంపించాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి తీసు కువచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమ వారం ఆమె గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ముందుగా లబ్దిదారులు బేస్మెంట్ వేసుకునేలా ప్రోత్సహించాలని, బేస్ మెంట్ స్థా యి నుండి పురోగతి పెంచుతూనే లేంటల్ స్థాయికి, ఆ తదుపరి పూ ర్తిస్థాయిలో నిర్మించుకునేలా చూ డాలన్నారు.
ఇండ్లు మంజూరైన అత్యంత నిరు పేదలు,ఇండ్లు నిర్మించుకునేందుకు ఆర్థికస్థోమత లేని వారిని గుర్తించి జాబితా పంపించాలని, వారికి స్వ యం సహాయక మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా ఋణమందించే బాధ్యత ఏపీఏపిఓలు తీసుకోవా లన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎక్క డైనా ఇసుక, లేబర్ సమస్య ఉంటే తక్షణమే తహసిల్దార్ తో మా ట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు సూచించారు. మండ లానికి మంజూరైన ఇండ్ల పురోగతి విషయంలో ఆర్డిఓ ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించాలని దేవరకొండ ఆర్ డిఓ రమణారెడ్డిని ఆదేశించారు.గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, దేవ రకొండ ఆర్డీవో రమణారెడ్డి, తహసి ల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరు లు ఈ సమీక్ష సమా వేశానికి హాజరయ్యారు.