Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్ ఆదేశాలు, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాల్సిందే
Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఇన్ పేషెంట్లు, అ వుట్ పేషెంట్ల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో సాధా రణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సీరియస్ ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఆమె నల్గొండ జిల్లా మర్రిగూడ కమ్యూనిటీ హెల్త్ సెంట ర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ ను ఇతర వి భాగాలను సందర్శించి ఆస్పత్రి ద్వా రా అందిస్తున్న వైద్య సేవలను పరి శీలించారు. అనంతరం డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఆస్పత్రిలో ఉన్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపి ,ఐపి రిజిస్టర్ లను ,ఏఎన్ సి రిజిస్టర్ లు తనిఖీ చేశారు .ఎక్స్ రే ప్లాంట్ పనితీరును అడిగి తెలుసు కున్నారు. కాగా ఎక్స్రే ప్లాంట్ యూ నిట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నిధు లనుండి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఐపి, ఇన్ పేషెంట్ల సం ఖ్య అవుట్ పేషంట్ల సంఖ్యను పెం చాలని, అదేవిధంగా సాధారణ ప్రస వాలు సైతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని సంద ర్శించి పాఠశాల పారిశుద్ధ్యం, విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరి శీలించారు . విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవా లని, అంతే కాకుండా నాణ్యమైన భోజనంతో పాటు ,గునాత్మక విద్య ను అందించాలని ఆదేశించారు. వి ద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరించా రు.
జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధి కారి డాక్టర్ మాతృనాయక్, తహసి ల్దార్, ఇతర అధికారులు ,ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తది తరులు ఉన్నారు.