— 9 లక్షల విలువైన స్కాలర్షిప్ లు విద్యార్థులకు అందజేత
YRF Foundation : ప్రజాదీవెన, హైదరాబాద్ : వైఆర్ఫీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ నాయకత్వంలో మాధాపూర్‌లోని వైష్ణోయ్ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం స్కాలర్షిప్ ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 9 లక్షల విలువైన స్కాలర్షిప్లు 40 మంది అర్హత కలిగిన విద్యార్థులకు అందజేశారు. ఇది విద్య, సాధికారత సామాజిక అభివృద్ధిపై ఫౌండేషన్ గాఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ముఖ్య అతిథిగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. జగదీశ్వర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఫౌండేషన్ విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న సహాయాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం తో ఫౌండేషన్ ఇప్పటివరకు తెలంగాణా, ఇతర ప్రాంతాల్లో 350 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించారు.
వీరిలో చాలామంది వైద్యులు, ఇంజనీర్లు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగారు. ఈ సందర్భంగా వై ఆర్పి ఫౌండర్ రవి ప్రసాద్ మాట్లాడుతూ
విద్య అనేది మార్పు కోసం అత్యంత శక్తివంతమైన సాధనం అని పేర్కొన్నారు. ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో రాణించిన తర్వాత అవసరం ఉన్న మరి కొంతమందికి సహాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యెలిశాల శరత్ చంద్ర,
యెలిశాల హేమ చంద్ర, ఎడ్ల కృష్ణ రెడ్డి, యమ దయాకర్, చకిలం శేషగిరి రావు, వైఆర్ఫీ ఫౌండేషన్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.