–సిపిఎం
–స్థానిక సమస్యల పరిశీలన
Secretary Dandampalli Sattayya : ప్రజాదీవెన నల్గొండ : 11వ వార్డు అర్బన్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్ల వెంట మురికి నీరు పారుతూ అస్తవ్యస్తంగా తయారైందని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆరోపించారు. బుధవారం సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పరిశీలనలో భాగంగా బుధవారం అర్బన్ కాలనీలో సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కాలనీకి ప్రధాన కేంద్రంగా ఉన్న గ్రౌండ్ వినాయక మండపం పక్కన నిర్మించిన మురికి కాలువ మురికి నీరు ఎటు పోకుండా నిలువ ఉండి దోమలు పెరిగి అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు త్వరలో జరగబోయే వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలంతా అక్కడికి వస్తారని దాని దృష్టిలో పెట్టుకొని మురికి కాలువ సరిచేసి నీరు తూర్పు వైపు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మసీదు వెనుక భాగం ఉన్న మోరి పడమర వైపు రోడ్డు లేకున్నా రోడ్డు నిర్మించిన సందర్భంలో అటువైపు నీళ్లు మళ్లించారని ప్రస్తుతం అక్కడ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నందున మురికి కాలువ కు కట్ట వేయడంతో రోడ్డు మీద మురికి నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరిగాయని అన్నారు.
అక్కడ నుంచి తూర్పు వైపు నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో బోర్ వాటర్ గేట్ వాల్ లోకి మురికి నీరు చేరుతుందని దాని ద్వారా నీరు కలుషితమై కాలనీ ప్రజలంతా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ అధికారులు అర్బన్ కాలనీ సందర్శించి అవసరమైన అన్నిచోట్ల మురికి కాలువలు నిర్మించాలని గ్రౌండ్ చిత్తాచెదారంతో నిండిపోయిందని అది శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండేపల్లి సరోజ, శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, శాఖ సభ్యులు దండెంపల్లి మారయ్య, పల్లె నగేష్, పామన గుండ్ల రాజు, కాలనీవాసులు ముచ్చర్ల విజయ్, దాసరి ప్రశాంత్, గడిగల సత్తెమ్మ, ముగుదాల లింగమ్మ, శరత్, కళ్యాణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.