PM Narendra Modi : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రైతు లు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పు డూ రాజీపడేది లేదని ప్రధానమం త్రి మోదీ స్పష్టం చేశారు. తమకు రై తుల ప్రయోజనాలే ముఖ్యమని అ న్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అం తర్జాతీయ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ట్రంప్ విధించిన సుం కాలపై పరోక్షంగా స్పందించారు. రై తుల సంక్షే మమే తన ప్రభుత్వ ప్ర ధాన ప్రాధాన్యత అని వెల్లడించా రు. ఈ విషయంలో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉం టుందనితెలుసని, అయినా రైతుల ప్రయోజనాల కోసం అందుకు భార త్ సిద్ధంగా ఉందని యూఎస్ కు కౌంటర్ ఇచ్చారు. వాణిజ్య చర్చల సమయంలో అమెరికా, భారత వ్య వసాయ మార్కెట్ లోకి మొక్కజొ న్న, సోయాబీన్స్, పత్తి వంటి పంట లకు మరింత ప్రవేశం కల్పించాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో ట్రం ప్ భారత్ ఎగుమతులపై 50 శాతం సుంకాలను విధించడం తాజా పరి ణామాల నేపథ్యంలో మోడీ అమె రికాకు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ప్రముఖ వ్యవసా యశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామ హుడు ఎంఎస్ స్వామినా థన్ శతజయంతి సందర్భంగా ఆ యన స్మారక నాణెం, శతాబ్ది స్మా రక స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. స్వామినా థన్ జీవవైవిధ్యాన్ని దాటి జీవ ఆ నందం అనే దార్శనిక భావనను అందించారని మోడీ కొనియాడారు. వ్యవసాయ శాస్త్రంలో ఆయన చేసి న మార్గ దర్శక కృషి నేటికీ భారత దేశ వ్యవసాయ రంగం అనుసరి స్తోందన్నారు. ఆహార ఉత్పత్తిలో దే శాన్ని స్వావ లంబన చేయడానికి చే సిన ఉద్య మానికి స్వామినాథన్ నాయకత్వం వహించారని మోడీ గుర్తు చేశారు.