Nalgonda Collector Tripathi : గుడిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో నల్లగొండ కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ
Nalgonda Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మూడు రో జులకు మించి జ్వరంతో బాధపడు తున్నట్లయితే తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె గుడిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది హాజరు రిజి స్టర్, ఓపి రిజిస్టర్, ఏఎన్ సీ, ఇన్ పే షెంట్ ,మందుల స్టాక్ రిజిస్టర్, తది తర రిజిస్టర్ లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వేను ని ర్వహించడం జరుగుతున్నదని, అ యితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సం భవిస్తున్నాయని, ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు పడకుం డా ఉండేందుకుగాను జ్వరం వచ్చి నప్పుడు తక్షణమే డాక్టర్ ను సంప్ర దించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు.
ప్రత్యేకించి 3 రోజులకు మించి జ్వ రం ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుం డా దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆ రోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్ తో చూ యించుకోవాలని తెలిపారు. సీజన ల్ వ్యాధులతో పాటు, అన్ని రకాల జబ్బులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక అవసర మైన మందులు సైతం సిద్ధంగా ఉ న్నాయని, అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్ట ర్లు వారి పరిధి లో ఎప్పటికప్పుడు జ్వరపీడితులను గమనిస్తూ ఉండా లని, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుండి సమాచారాన్ని సేకరించి వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని, ఇందుకు గాను మందు లతో పాటు, ఇతర పరీక్షలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దేవరకొం డ ఆర్డిఓ రమ ణారెడ్డి, ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు, తది తరులు ఉన్నారు.