CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్యలు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి, చర్ల పల్లి జైలుకి ఏమన్నా తేడా ఉందా?
CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: నేను విద్వే ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు,కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అధికారం లో ఉన్నప్పటికీ ఇతరుల ఇంటి వ్య వహారాల్లో జోక్యం చేసుకోకుండా నై తికంగా వ్యవహరిస్తామని స్పష్టం చే శారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ జీవనశై లిని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ చర్చ నీయాంశమయ్యేలా చేశారు. ఆ యన నివాసాన్ని చర్లపల్లి జైలుతో పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు ప్రయో గించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి, చ ర్లపల్లి జైలుకి తేడా ఏముంది
ఫామ్‌హౌస్‌లో పోలీసుల పర్య వేక్షణ ఉంటుంది, జైలులో ప్రహరీ ఉంటుంది. రెండింటికీ సందర్శకులు వస్తుంటారు. కేసీఆర్ తానేం జైలుకె ళ్లకపోయినా, ఫామ్‌హౌస్ జీవనశైలి చూస్తే యధావిధిగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.ఆయన తానే జైలు లో ఉన్నట్టు జీవిస్తున్నారు. రాజకీ యంగా ఓడించడమే అతనికి పెద్ద శిక్ష అని చెప్పారు.గురువారం ఆ యన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడా రు.
కాంగ్రెస్‌ను ప్రజలు రెండోసారి గెలి పిస్తారు. తమ పాలన పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం వ్యక్తం చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎ న్నిక, బిహార్ ఎన్నికలపై ప్రకటన
త్వరలో బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని సం కేతాలు ఇచ్చారు.బీఆర్‌ఎస్ నేతల కు నైతికతపై మాట్లాడే అర్హత లేదు”
గత 10 ఏళ్ల పాలనలో ప్రజలను మోసగించిన వారెవరో అందరికీ తె లుసని, బీఆర్‌ఎస్ నాయకులు నై తికతపై మాట్లాడటం శోభించద న్నారు.
ఈ తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర రాజ కీయాల్లో రేగిన మంట మరింత ఉత్కంఠ భరితంగా మారనుంది. ముఖ్యంగా కేసీఆర్‌పై వ్యక్తిగత స్థా యిలో వచ్చిన విమర్శలు బీఆర్ ఎస్ ప్రతిస్పందనకు దారి తీసే అవ కాశం ఉంది. రాబోయే ఉపఎన్నిక లు, బిహార్ ప్రచార నేపథ్యంగా రే వంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ వ్యూ హాన్ని ముందుకు తీసుకెళ్తున్నా యన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏక గ్రీవంగా తీర్మానించిన బిల్లులను త క్షణం ఆమోదించాలని ముఖ్యమం త్రి శభారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ముని మరోసారి విజ్ఞప్తి చేశారు. రా ష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే క లిసి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీ వచ్చి నట్టు తెలిపారు. బీసీలకు విద్య, ఉ ద్యోగావకాశాల్లో, అలాగే స్థానిక సం స్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేష న్లు కల్పించడానికి శాసనసభ రెం డు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదిం చిందని ఈ సందర్భంగా గుర్తుచేశా రు.
స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతంకంటే మించి ఉండడానికి వీలులేకుండా గతంలో చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో ఆ పరిమి తిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ ర్డినెన్స్ జారీ చేసిందనీ, ఆ ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ రాష్ట్రపతికి పం పించారని గుర్తు చేస్తూ ఈ మూ డిం టిని తక్షణం ఆమోదించాలని కోరా రు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించాలన్న చిత్తశుద్ధితో రాష్ట్ర స్థా యిలో ప్రభుత్వ అన్ని ప్రయత్నాలు చేసిందని, రాష్ట్రపతి గారి వద్ద పెం డింగ్‌లో ఉన్న కారణంగానే వారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి మొత్తం మంత్రివర్గంతో పాటు ఎంపీలతో పా టు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా ఢి ల్లీ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభు త్వ పరంగా చిత్తశుద్ధితో అన్ని ప్ర యత్నాలు చేసినప్పటికీ, ఈ విష యంలో కేంద్రం నుంచి సహకారం లభించలేదని పేర్కొన్నారు. తదు పరి కార్యాచరణపై చర్చించి నిర్ణ యం తీసుకుంటామని అన్నారు.