Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు.
సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల సర్వేలో భాగంగా మూడో వార్డు శేషమ్మ గూడెంలో నిర్మించిన మురుగునీరు శుద్ధి కేంద్రం ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 56 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి పనులు పూర్తి చేయకుండా 2014 లో 32 కోట్ల రూపాయల అంచనా వేయాన్ని పెంచి ఆరు సంవత్సరాలు పూర్తయిన నాటి వరకు పనులు పూర్తి చేసి మురుగునీరు సిద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావలసి ఉండే కానీ 2022లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరింప చేయాలని ప్రణాళికతో 216 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో 2008లో వర్తింప చేయని పానగల్లు పెద్దబండ లాంటి, ప్రాముఖ్యమైన ప్రాంతాలకు వర్తింప చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇండ్లు లేని ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు మూడు సంవత్సరాలు అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఎగుడుదిగుడుగా పైప్ లైన్లు వేస్తూ క్యూరింగ్ లేని మన్యువల్స్ నిర్మాణం చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా పైప్ లైన్ కోసం తవ్వుతున్న క్రమంలో రాళ్లు రాకుండా వచ్చినట్టుగా అవి తొలగించినట్టుగా బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ప్రాధాన్యత క్రమంలో పానగల్లు పెద్ద బండ, విలీన 7 గ్రామ పంచాయతీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం ప్రజాప్రతినిధులకు కాంట్రాక్టర్లకు అధికారులకు కమిషన్లు కురిపించే వరదాయినిగా మారిందని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కావడమే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగడంలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యత ప్రమాణాలను పాట్టిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అవుట రవీందర్, కుంభం కృష్ణారెడ్డి, గాదే నరసింహ, పాత లింగయ్య, అద్దంకి నరసింహ, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, సలివోలు సైదాచారి, కన్నెకంటి సత్యనారాయణ, ఎండి సర్దార్ అలీ తదితరులు పాల్గొన్నారు.