CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: విరామం లేని వర్షాలతో రాష్ట్ర రాజధాని హై దరాబాద్ నగరం అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగ రం తడిసి ముద్దవుతున్న క్ర మంలో ఎడతెరపి లేకుండా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతం లో వరుస వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ వుతూనే ఉన్నాయి.
రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపో తుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపై కి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య లు నిత్యకృత్యమవుతున్నాయి. అ టువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయి లో పర్యటించేందుకు సిద్ధమయ్యా రు. ఈ మేరకు ఆదివారం హైదరా బాద్‌లోని వరద ముంపు ప్రాంతాల ను ఉ న్నతాధికారులతో కలిసి ఆ యన స్వయంగా పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలిoచా రు.
అందులో భాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మంచి నీరు ఎలా వస్తుంది. అందులో ఏమైనా మురుగు నీరు క లుస్తుందా లేదా అంటూ వారిని స్వ యంగా అడిగి తెలుసుకున్నారు. అ లాగే అంతకుముందు అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని గంగూబా యి బస్తీ, బుద్ధ నగర్‌ను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి స మస్యలను వెంటనే యుద్ధ ప్రాతిప దికన పరిష్కరించాలని ఈ సంద ర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అలాగే వర్షాల నేపథ్యంలో సహా యక చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమీష నర్ స హా ఇతర అధికారులను ఆ యన వివరాలు అడిగి తెలుసుకు న్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థ ను సైతం ఆయన పరిశీలించారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించా రు.
*రేపు ఆ 11 జిల్లాలకు ఎల్లో అ లెర్ట్* ఈనెల 13న బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడనున్న ట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ శాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుండగా, దాని ప్రభావం తో రాష్ట్రంలో వర్షాల అవకాశముం దని అంచనా వేసింది. కాగా ఈరో జు తెలంగాణలోని ములుగు, భద్రా ద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగా రెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎ ల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని, అదేవిధంగా గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
రేపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎ ల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అ ప్రమత్తంగా ఉండి, అవసరమైతే త ప్ప బయటకు వెళ్లకూడదని వాతా వరణ శాఖ సూచించింది.
*భాగ్యనగరానికి మళ్ళీ వర్ష భ యం భయం…* .నగరంపై మళ్లీ వ ర్ష మేఘాలు కమ్ముకున్నాయి. మరో గంటలో హైదరాబాద్ వ్యాప్తంగా భా రీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇ ప్పటికే బోడుప్పల్, మేడిపల్లి, ఉప్ప ల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందు న జీహెచ్‌ఎంసీ ప్రజలకు అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
అత్యవసర పరిస్థితులు తప్ప బ యటకు రావద్దని, వర్షం సమయం లో విద్యుత్ స్తంభాలు, చెట్లు, బహి రంగ ప్రదేశాలకు దూరంగా ఉండాల ని సూచించింది. రోడ్లపై నీరు నిలిచే అవకాశముండడంతో వాహనదారు లు జాగ్రత్తగా ప్రయాణించాలంటూ హెచ్చరించింది.రెస్క్యూ బృందాలు, మోన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ఫీ ల్డ్‌లో సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి అత్యవసర సమస్యల కోసం 040- 21111111 లేదా 100 నంబర్లకు కాల్ చేయవచ్చని జీహెచ్‌ఎంసీ తెలిపింది.