–అప్పులపై కాంగ్రెస్ పచ్చిఅబద్దా లు తప్పని తేల్చిన చట్టసభలు
–బీఆర్ఎస్ హయాఅప్పు రూ.3.5 లక్షల కోట్లని కేంద్రం సుస్పష్టం
–ఇంతకాలం అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి ది అబద్ధపు ప్రచారం
–బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ఘాటు వ్యాఖ్య
KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కో ట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గా యిగాయి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామా రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నట్టు గా తమ హయాంలో రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్ల కాదని, కేవ లం 3.5 లక్షల కోట్లు మాత్రమే అన్న నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పు కుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణ లు పచ్చి అబద్దాలన్న సంగతి పార్ల మెంట్ లో సోమవారం నిరూపించ బడ్డయన్నారు. గత ఎన్నికల సమ యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అ ప్రతిష్టపాలు చేయడానికి రూ. 8 ల క్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్ర చారానికి దిగిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం ఎ క్కడ పెట్టుకుంటారని కేటీఆర్ ప్ర శ్నించారు.
తాము అధికారం నుంచి దిగిపోయి న తరువాత అంటే 2024 మార్చి 3 1 నాటికి తెలంగాణ ప్రభుత్వఅప్పు రూ. 3,50,520.39 కోట్లు మాత్రమే అన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదన్నారు. సంక్షేమ పథకాల కే కాకుండా, భవష్యత్ తరాలకు ఉ పయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిం దన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రా జెక్టుతో పాటు వివిధ మౌలిక సదు పాయాల కల్పన కోసం ఆ నిధుల ను ఖర్చు చేసిందన్నారు. కేసీఆర్ నే తృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆ ర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రా ష్ట్రం వేగంగా పురోగమించిందని కే టీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్ర భుత్వం తెలివిగా ఆర్థిక నిర్వహణ చేసిన సంగతి కేంద్రం ఇచ్చిన నివే దిక తో తెలుస్తుందన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి తె లంగాణ అప్పులు రూ. 3,50,52 0.39 కోట్లు అయితే, అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల వి లువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉందన్నారు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. గత ఆరు ఆర్థిక సంవత్సరాలుగా (201 8-19 నుండి 2023-24 వరకు) ప్ర తి ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 50 వేల కోట్లకు పైగా పెరిగిందన్న కేటీఆర్, బీఆర్ఎ స్ ప్రభుత్వ సమర్థతకు ఈ గణాం కాలే నిదర్శనం అన్నారు.అప్పులు చేయడంలో కాంగ్రెస్ దూకుడు, ఆ స్తులు పెంచడంలో మాత్రం వెనుక డుగు
బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆరోపించిన రే వంత్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అ యిన మరు క్షణం నుంచే విపరీతం గా అప్పులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి అంటే అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి వివిధ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేసినట్లు స్వయంగా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించిన సంగతిని కేటీఆర్ గు ర్తుచేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్ట కుండానే, హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయ కుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిం దో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చే శారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచి త, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తె లంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అ ప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపిం చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇ చ్చిన గణాంకాలపై ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ని జాలు తెలుసుకుని, నిరాధారమైన ఆరోపణలు మానుకుని, రాష్ట్ర అ భివృద్ధికి కృషి చేయాలని సూచిం చారు. పారదర్శకత లేని ఆర్థిక వి ధానాలను అవలంబిస్తూ, అప్పుల ను ప్రజల మీద మోపుతున్న కాంగ్రె స్ ప్రభుత్వం ముందుగా తమ పరి పాలన గురించి సమీక్షించుకోవాల న్నారు.