MLA KomatiReddy Rajagopal Reddy : మరోమారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్, సమీకరణాలు పార్టీలో చేరినప్పుడు తెలియదా
MLA KomatiReddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నల్ల గొండ జిల్లా మునుగోడు శాసనసభ్యుడు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్నప్పు డు సమీకరణాల సమాచారం మీ వద్ద లేదా అంటూ సొంత పార్టీ నా యకత్వాన్ని ప్రశ్నించారు. మీ రు మాటిచ్చారు ఇచ్చి నప్పుడు ఇవ్వం డి కానీ అప్పటివరకు మా త్రం మునుగోడు అభి వృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని అప్పీల్ చేశారు.మంగళవారం మునుగోడు మండలం ఎలగలగూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి ప్రా రంభించిన అనంతరం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈఘాటు వ్యా ఖ్యలు చేశారు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చే సిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లో నే…ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అం టున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు, ఎవ రడ్డుకుంటున్నారు నాకు మంత్రి పదవిరాకుండా.
నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నద మ్ములం ఉన్నామని. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రా మిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉ న్నామని. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మ ల్లయ్య అన్న చందంగా ఉంది. 9 మంది ఎమ్మె ల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గు రు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉ న్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమ ర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యా యం జరిగినట్టె. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మును గో డు ప్రజలకు అన్యాయంచేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇ ప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. ఆలస్యమైనా సరే నేను ఓపిక ప డుతున్న. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు ని యో జకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. భువనగిరి పార్లమెంటు నుండి ఎం పీ గా పని చేశాను, నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను.
నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజక వర్గం వెనుక బడి ఉంది. ప్రభుత్వ దవాఖానక పోతే పేదోడికి న్యా యం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేద వాడి రక్తం తాగుతున్నాయి. పేదవాళ్ల అండగా ఉండా లని నేను కష్టపడు తున్న. ఆ భగవం తు డు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదంటూ ఓ విధంగా మళ్ళీ అధికార పార్టీ అధి ష్టానానికి హెచ్చరిక జారీ చేశారు.
మొత్తానికి తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్త పరుస్తున్న అసంతృప్తి తారస్థాయికి చేరుతున్నట్టు కన బడుతుంది. ప్రభు త్వంలో ఒకరు ఒక విధంగా మరొ విధంగా రాజ గోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ విషయంలో స్పష్టత ఇస్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఘాటుగానే కొనసాగుతున్నాయి.
గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యా ఖ్యలు తారస్థాయికి చేరుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీ య పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి అన్న ఆసక్తిని రాజకీయ పరిశీలకులు క్షణక్షణం గమనిస్తున్నారు.