Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, రానున్న 72గంట‌లు అప్రమత్తo, అధికారులు,సిబ్బందికి సెల‌వులు ర‌ద్దు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ప్రమాద కర వర్షాల నేపద్యంలో ఎంత‌టి భా రీ వ‌ర్షాలు వ‌చ్చినా ప్రాణన‌ష్టం వాటి ల్ల‌కుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశా రు. లోత‌ట్టు కాజ్‌వేలు, ఉద్ధృతంగా ప్ర‌వ‌హించే న‌దులు, వాగులు, వంక‌ ల‌పై వంతెన‌లపై నుంచి రాక‌పోక‌లు లేకుండా చూ డాల‌ని సీఎం సూచిం చారు. ప‌శువులు,గొర్రెలు, మేక‌ల కాప‌ర్లు త‌ర‌ చూ వాగుల్లో చిక్కుకొని పోతున్నార‌ని ఈ విష‌యంలో ముం ద‌స్తు గా వారిని అప్ర‌మ‌త్తం చేయాల‌ ని సీఎం సూచించారు. ఎక్క‌డైనా ప్ర‌ మాద‌వ‌శాత్తూ చిక్కుకుంటే వారిని త‌క్ష‌ణ‌మే బ‌య‌ట‌కు తీసుకువ‌ చ్చే ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.అదే స‌మ‌యంలో ప‌శు న‌ష్టం వాటి ల్ల‌కుండా చూడాల‌న్నారు.

రానున్న 72 గంట‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌నే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారులు, జిల్లా క‌ లెక్ట‌ర్ల‌తో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రె డ్డి మంగ‌ళ‌వారం సా యంత్రం వీడి యో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌నే హె చ్చ‌రిక‌లు ఉన్న జిల్లాల‌కు సీనియర్ అధికారుల‌ను ప్ర‌త్యేకాధికారులుగా నియ‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ ద‌ర్శి రామ‌కృష్ణారావుకు సీఎం సూచించారు. అన్ని శాఖ‌ల అధికారు లు, సిబ్బంది సెల‌వులు ర‌ద్దు చేయాల‌ని అంతా క్షేత్ర స్థాయిలో అం దుబాటులో ఉండాల‌ని సీఎం ఆదేశించారు.

రెండు రోజుల్లో ఎంత వ‌ర్ష‌పాతం వ‌స్తుంది ఎలా ఎదుర్కోవాల‌నే దాని పై మ‌న‌కు మాన్యువ‌ల్స్ ఉన్నాయ‌ ని కానీ వాతావ‌ర‌ణ మా ర్పుల‌తో రెండు గంట‌ల్లోనే రెండు నెల‌ల వ‌ర్ష‌ పాతం కురు స్తోంద‌ని క్లౌడ్ బ‌స్ట‌ర్స్‌తో ఊహించ‌నంత న‌ష్టం వాటిల్లుతోంద‌ని సీఎం తెలి పారు.

క్లౌడ్ బ‌స్ట‌ర్ ప‌రి స్థితులను ఎదుర్కొ నే వ్యూహాల‌ను సిద్దం చేసు కోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఊహించ‌నంత వ‌ర్ష‌ పా తంతో గ‌తంలో ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ లు ప్రాంతాల్లో ప్రాణ న‌ష్టంతో పాటు భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని అ టువంటి ఘ‌ట‌ న‌లు ఎట్టి ప‌రిస్థితు ల్లోనూ పున‌రావృతం కావ‌డానికి వీల్లేద‌ని సీఎం అన్నారు.ప్రాజెక్టులు, చెరువులు, కుంట‌ల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై పూ ర్తి అవ‌గాహ‌న‌తో ఉండాల‌ ని నీటి పారుదల శాఖ అధికారుల‌ ను సీఎం ఆదేశించారు. జ‌ల విద్యు త్ త‌యారీపైనా దృష్టి సారించాల‌ ని, అదే స‌మ‌యంలో నీటి విడుద‌ల‌ పై పూర్తి స‌మాచారం లోత‌ట్టు ప్రాం తాల ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ న్నారు. చెరువులు, కుంట‌లు క‌ట్ట‌ల తెగే ప్ర‌మాదం ఉన్నందున ముంద‌ స్తుగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకో వా ల‌ని సూచించారు.

విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బం ది 24X7 అందుబాటులో ఉం డాల‌ ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొబైల్ ట్రాన్స్‌ఫా ర్మ‌ర్లు, జ‌న‌రేటర్లు , విద్యుత్ స్తంభాలు, ఇత‌ర సామ‌గ్రి సిద్దంగా ఉంచాల‌ న్నారు. స‌మ‌స్య ఎక్క‌డ త‌లెత్తినా త‌క్ష‌ణ‌మే పరిష్క‌ రించాల‌న్నారు. వైద్యారోగ్య సిబ్బం ది అప్ర‌మత్తంగా ఉండాల‌ని పీహె చ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవ‌స‌ర‌మైన మందులు ఉంచాల‌ని, గ‌ర్భిణుల‌ను త‌క్ష‌ణ‌మే త‌ర‌లించేలా అంబులెన్స్‌ లు అందుబాటులో ఉంచాల‌ని సీ ఎం సూచించారు. అన్ని ప‌ట్ట‌ణాల్లో లోత‌ట్టు ప్ర‌దేశాల నుంచి ప్ర‌జ‌ల‌ను స‌హాయక శిబిరాల‌కు త‌ర‌లించా ల‌ని వారికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను సీఎం ఆదేశించారు. పిడుగు పాట్ల‌తో ప‌శు వులు, మేక‌లు, గొర్రెలు చ‌నిపో యి న‌ప్పుడు ఎఫ్ఐ ఆర్‌లు న‌మోదు చే యించి బాధితుల‌కు ప‌రిహారం అందేలా చూడా ల‌ని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

రాజధాని హైద‌రాబాద్ న‌గ‌రం లో… హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌ర్‌లు స‌మ‌న్వ‌ యంతో ప‌ని చేయాల‌ని సీఎం రేవం త్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్‌, ఎంఏ యూడీ ప్ర‌తి విభాగం స‌మ‌న్వ‌యంతో ముందు కు సాగాల‌ని సీఎం సూచించారు. ఐటీ, విద్యా శాఖ ఉన్న‌తాధికారులు ప‌రిస్థితిపై స‌మీ క్షించి వ‌ర్క్ ఫ్రం హోం సెల‌వుల విష‌య‌మై నిర్ణ‌యం తీసు కోవాల‌ని సీఎం సూచించారు. హై డ్రా, విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బంది, అ గ్నిమా ప‌క సిబ్బంది, జీహెచ్ఎంసీ సి బ్బంది స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని సీఎం సూచించారు.

హైడ్రా టోల్ ఫ్రీ నెంబ‌ర్లు ఏర్పాటు చే యాల‌ని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌ మ‌ స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించా ల‌ ని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ క్ర‌మ‌ బ‌ద్ధీక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సీఎం ఆదేశించారు. లా అండ్ ఆర్డ‌ర్ పోలీసులు సైతం ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ ర‌ణ‌లో భాగ‌ స్వాములు కావాల‌ని సీ ఎం సూచించారు. వాతావ‌ర‌ణ హె చ్చ‌రి క‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చార‌, ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ ల‌కు అంద‌జేయాల‌ని అదే స‌మ‌ యంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకో వాల‌ని సీఎం ఆదేశించారు.ఈ స‌మీ క్ష‌లో మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, కోమ‌ టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, తుమ్మ‌ ల నాగే శ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భా క‌ర్, సీఎస్ రామ‌కృష్ణారావు, డీజీపీ జితేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.