–ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
MLC Nellikanti Satya : ప్రజాదీవెన నల్గొండ : మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 20 నుండి 22వ తేదీ వరకు జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.నల్లగొండ జిల్లా సిపిఐ కార్యవర్గ సమావేశం గురువారం స్థానిక మగ్ధుమ్ భవన్ లో ఆర్ అంజచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ దేశంలో సిపిఐ వందేళ్ళ ప్రస్థానంతో కార్మి కులు కర్షకులు అణగారిన వర్గాల ప్రజల కోసం అనేక సమరశీల పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర ఉందన్నారు. దేశంలో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పాలకులు అవలంబించిన ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రానికి రావాల్సి యూరియా కోటాను కేంద్రం తగ్గించడం జరిగిందని రాష్ట్రంలో ఉన్న బిజెపి మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్, 8మంది బిజెపి ఎంపి లు రాష్ట్రానికి రావలసిన యూరియా తీసుకురావడంలో పూర్తిగా విప్లమయ్యారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ సాగు పెరుగుతుంది. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకుండా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ లో యూరియా ను అధిక రెట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టిస్తూన్న వ్యాపారస్తుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, గిరిజ రామచంద్రం, బొల్గురి నర్సింహా, టి. వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, టి. బుచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.