Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

President Nampalli Chandramouli :క్యూబా ప్రజలకు అండగా ఉందాం

*ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి*

President Nampalli Chandramouli :  ప్రజా దీవెన నాంపల్లి : అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నాంపల్లి మండలం లో క్యూబా సంఘీభావనిది విరాళాల సేకరణ గురువారం రోజు న జరిపారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు అన్ని రంగాల కార్మికులు ఈరోజు క్యూబా ప్రజలు ఉన్న పరిస్థితుల్లో అనేక రూపాల్లో అంతర్జాతీయ సంఘీభావం అవసరం ఎక్కువగా ఉన్నదని అన్నారు. క్యూబన్ విప్లవ సారధి కామ్రేడ్ ఫెడరల్ కాస్ట్రో శతజయంతి మరియు క్యూబా విప్లవ 66వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక, వస్తు రూపంలో సంఘీభావం తెలియజేయాలని భారతదేశంలోని *నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా* నిర్ణయించిందని కమిటీలో భాగస్వామిగా ఉన్న సిఐటియు కార్మిక సంస్థ అంతర్జాతీయతో పని చేస్తుందని అన్నారు.

 

ప్రపంచంలో ఏ కార్మికుడు, ప్రజలు కష్టంలో ఉన్న వారికి అండగా సిఐటియు నిలబడుతుందని అందుకోసమే సిఐటియు క్యూబా సంఘీభావ నిధి విరాళాల సేకరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్యూబా పై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన 31 తీర్మానాలను అమెరికా తిరస్కరించిందని, క్యూబా వ్యతిరేక శక్తులకు టెర్రరిస్టులకు మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ క్యూబాను అస్థిరపరిచేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమల నాశనం వెనుక అమెరికా హస్తం ఉంది మన కార్మిక చట్టాలు అన్నింటిని రద్దుకు అమెరికా ఒత్తిడే కీలకమని అన్నారు అమెరికా వల్లే భారతీయ పరిశ్రమలెన్నో విలవిలలాడి మూతపడుతున్నాయని అందుకే మనకి ఎవరు శత్రువు క్యూబాకు కూడా ఆ అమెరికా శత్రువు అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా క్యూబా సంఘీభావం నిధి విరాళాలు ఇచ్చి తమ అంతర్జాతీయతను చాటుకోవాలని పిలుపునిచ్చారు

*ఈ కార్యక్రమంలో నాంపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది మరియమ్మ, ఈరమ్మ, రాములమ్మ సులోచన, వెంకటేష్, వకీరు, చంద్రమ్మ, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పూల శివ,తదితరులు పాల్గొన్నారు*