Road Accident : ప్రజా దీవెన,కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బర్దవాన్ ప్రాంతంలో శు క్రవారం ఆగి ఉన్న లారీని భక్తులతో వెళ్తున్న బస్సు బలంగా ఢీకొట్టడం తో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే తుది శ్వాస విడవగా, మరో 35 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టారు.
మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అందుబాటులోని ఆయా ఆస్పత్రులకు తరలించారు. మృతులను బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని మోతీహారీకి చెందిన వా రని పోలీసులు నిర్ధారించారు. మృ తుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బ స్సులో మొత్తం 45 మంది యాత్రి కులు ఉన్నట్లు పోలీసులు అధికారి కంగా తెలిపారు.
ఈనెల 8వ తేదీన వారు తమ యా త్రను ప్రారంభించారు. మొదట జా ర్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ను సందర్శించా రు. అనంతరం దక్షిణ 24 పరగణా ల జిల్లాలోని గంగాసాగర్‌ను సంద ర్శించారు. అక్కడ్నుంచి ఇంటికి తిరి గి వెళ్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్రు లో ఉండడమే ప్రమాదానికి కారణ మని పోలీసుల ప్రాథమిక విచారణ లో తేలింది. ఈ మేరకు కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.