–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Sakhi Victims : ప్రజాదీవెన, నల్లగొండ: సఖి బాధి తులకు ప్రభుత్వం అండగా ఉం టుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం లోని సఖి కేంద్రాన్ని సందర్శించారు.
సఖి సెంటర్ లో అందిస్తున్న సేవల ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ్య రిసోర్స సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ సెంటర్ ఫర్ ఓల్డ్ సాలిదారిటీ వారి ఆర్థిక సౌజన్యంతో జిల్లాల్లో గుర్తించ బడిన సఖి విజేతలకు17 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేసి చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడా రు.
బాధితులకి ప్రభుత్వం అండగా ఉం టుందని వారికి అందుతున్న సేవల లో జాప్యం జరిగినట్లయితే ప్రభు త్వం చిత్తశుద్ధితో పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో త్వరితగతి న న్యాయం జరగడం కోసం కృషి చే స్తామని అన్నారు. సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సఖి బాధితులకు కావల సిన సహాయం అందించినట్లయితే వారు భవిష్యత్తులో ముందుకు వెళ్ల గలుగుతారని వివరించారు.
అందుకోసం ప్రభుత్వల శాఖల సమన్వయం ఏ మేరకు అవసరం ఉన్నదో గుర్తించి జిల్లా స్థాయిలో ఒ క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సఖి విజేతలకు న్యాయం జరిగేలా చూడడం జరుగుతుందని అన్నా రు. సఖి కేంద్రం నందు నెలకు సు మారుగా 60 నుంచి 70 కేసులు రా వడం జరుగుతుందని, వారికి జిల్లా లో ఐదు రకాలైన సేవలును ఒకేచో ట అందించడంతోపాటు వారికి త్వ రితగతిన న్యాయం జరిగేలా సిబ్బం ది కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
సఖి విజేతలు మానసిక స్థైర్యాన్ని పెంపొంది దృఢంగా ఉండి వారి కు టుంబ సభ్యుల సహకారంతో విజే తలుగా తయారవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.వి కృష్ణవేణి, గ్రా మ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ సుమలత, సఖి సిబ్బంది సునీత, వరుణ, నాగమణి తది తరులు పాల్గొన్నారు.