–డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్
DYFI Mallam Mahesh : ప్రజాదీవెన నల్గొండ : యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే నినాదం తో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ యుద్దోన్మాదని ఖండించాలని పాలస్తీనా పై గత ఏడాదిన్నరగా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ శాంతిని కాపాడాలన్నారు. ప్రపంచ శాంతిని కాపాడాలని ఆగస్టు 18న నల్గొండలో జరిగే శాంతి ర్యాలీలో ప్రముఖులు, మేధావులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. అమెరికా అండతో ఇజ్రాయిల్
యుద్ధం పేరిట పాలస్తీనాలో చిన్నపిల్లలను సైతం వదలకుండా చంపుతున్నారు. ఇప్పటివరకు 85000 మంది చిన్న, పెద్ద చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు, అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. 245 మంది జర్నలిస్టులను చంపారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి సూచనలు చేసినా అమెరికా సామ్రాజ్యవాద నియంతృత్వ ధోరణితో వివరిస్తున్న తీరును మేధావులు, శాంతికాముకులు, వామపక్షాలు ఖండించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, గద్దపాటి సుధాకర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్, సైఫ్ జిల్లా నాయకులు పోకల శశి, బొడ్డుపల్లి నరేష్, గంజి రాజేష్, వంశీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.