Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterPonguletiSrinivasReddy : ప్రభుత్వం కీలక ప్రకటన, గాంధీజ‌యంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌లు

 

MinisterPonguletiSrinivasReddy : ప్రజా దీవెన, హైద రాబాద్: భూస మస్యలకు ఓరకంగా ప్రతిబంధకంగా నిలిచిన సర్వే యర్ ల కొరత తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారం భించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో లై సెన్స్ డ్ స‌ ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2వ తేదీ గాంధీ జ‌యంతి నాటికి అందుబాటు లోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రె వెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీ‌నివాస‌రెడ్డి కీలక ప్రకటన చే శారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి మొద‌టి విడ‌త స‌ర్వేయ‌ర్ల శిక్ష‌ణ పూర్త‌యింద‌ని రెండవ విడ‌త శిక్ష‌ణ 23 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అభ్యర్ధు లు ఆయా జిల్లా ల్లో 18వ తేదీ ఉద‌యం 10 గంటల లోపు స‌ర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాల‌ని సూచించారు.

లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల నియామకంపై ఆదివారం అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభార‌తి చ‌ట్టం లో రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాప్ త‌ప్పనిస‌రి చేసిన నేప‌ధ్యం లో ఇందుకు అవ‌స‌ర‌మైన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను గాంధీ జ‌యం తి రోజునాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ ని తెలిపారు.

ఇందుకు సంబంధించి మే 26 నుం చి జూలై 26 వ‌ర‌కు 50 ప‌నిది నాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో ఏడు వేల మందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రి గింద‌ని, గ‌త నెల 28, 29 తేదీల్లో జెఎన్‌టియు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష నిర్వహించి ఫ‌లితాలు ప్రక‌టిం చామ‌ని తెలిపారు. ఈ ప‌రీక్షలో ఉ త్తీర్ణులైన అభ్యర్దుల‌కు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్ష ణను కూడా ప్రా రంభించ‌డం జ‌రిగిద‌ని తెలిపారు.ఈ శిక్ష‌ణ పూర్త‌ యిన వెంట‌నే వీరికి లైసెన్స్ జారీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

వీరి సేవ‌లను పారద‌ర్శ‌కంగా నిర్వ‌ హించ‌డానికి వీలుగా స‌ర్వే మా న్యువ‌ల్ ను రూపొందించాల‌ని అధికా రుల‌కు సూచించారు. రెవె న్యూ, స‌ర్వే విభాగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంద‌ని స‌ ర్వే విభాగం బ‌లోపేతం తోనే రెవెన్యూ వ్యవ‌స్ధలో మెరుగైన సేవ‌లు అందించ‌గ‌లుగు తామ‌ని దీనిని దృష్టిలో పెట్టుకొని స‌ర్వేవిభాగాన్ని బ‌లోపేతం చేస్తు న్నామ‌ని తెలిపారు. గ‌త ప‌దేళ్ళలో స‌ర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంద‌న్నారు.