Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ అల్టిమేటం, ఆరోపణలు నిరూపిం చండి లేదా క్షమాపణలు చెప్పండని చురకలు
Rahul Gandhi : ప్రజా దీవెన, న్యూడిల్లీ:ఓటు చోరీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు మార్లు చేసిన సంచలన ఆరోపణల కు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అల్టిమేట్ కౌంటర్ ఇచ్చింది. మహా రాష్ట్రలో నకిలీ ఓట్లు, ఓటర్ల సంఖ్య పెరగడం వంటి ఆరోపణలపై రా హుల్ చేసిన వ్యాఖ్యసత్యదూరమ ని స్పష్టం చేసింది. సీఈసీ జారీచేసి న ప్రకటనలో ఈ క్రింది విధంగా పే ర్కొనబడింది.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదు. మహా రాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజ మైతే, సరైన సమయంలో ఆయన ఎందుకు అభ్యంతరం తెలపలేదు? ఎన్నికలు పూర్తై ఎనిమిది నెలలు గ డిచిన తర్వాత ఇలాంటి ఆరోపణ లు చేయడం ఏ ప్రయోజనమని ప్ర శ్నించింది.అలాగే, “ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ ఏడు రోజుల్లోగా అ ఫిడవిట్ దాఖలు చేయాలి.
ఆయన వద్ద ఆధారాలు ఉంటే వా టిని సమర్పించాలి. అలా చేయక పోతే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పా లి. పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని సీఈసీ స్ప ష్టం చేసింది.ఎన్నికల ప్రక్రియలో పా రదర్శకతకు ఎన్నికల సంఘం కట్టు బడి ఉందని, ప్రతి ఓటు విలువైనదే కాని దానిపై నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేయడం సరి కాదని ఎన్నికల సంఘం హెచ్చరిం చింది.