Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా సోషల్ మీడియా కృషి చేయాలి

Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, కోదాడ: నాడు ఎలా ఉంది నేడు ఎలామారిoది అనే కోణంలో ప్రభుత్వకార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి ప్రజలను ఆకర్షించే విధంగా పోస్టులు, రీల్స్ తయారు చేయాలని సోషల్ మీడి యా వారియర్స్ కు రాష్ట్ర నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కోదాడ పట్టణంలోని స్థాని క కాశీనాథం ఫంక్షన్ హాల్ లో సో మవారం నిర్వహించిన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల సోషల్ మీడియా వారియర్స్ స మా వేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

 

సోషల్ మీడియా వారియర్స్ అంద రూ ఫేస్ బుక్,ట్విట్టర్, ఇన్ స్టాగ్రా మ్, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపులు, వా ట్సాప్ ఛానల్ ద్వారా పోస్టులు, రీ ల్స్ ప్రజలను ఆకర్షించేలా తయారు చేసి ప్రజలకు చేరుకునే విధంగా ప్ర తి ఒక్కరూ పనిచేయాలని అన్నా రు. మంచిగా పని చేసిన సోషల్ మీ డియా వారియర్స్ కు సంపూర్ణ గౌ రవం,గుర్తింపు,మర్యాదతో పాటు సహాయం చేయడం జరుగుతుంద ని ప్రతినెల సోషల్ మీడియా వారి యర్స్ తో మీటింగ్ నిర్వహించి కో దాడ, హుజూర్ నగర్ నియోజకవ ర్గాలలో మంచిగా పనిచేసిన పది మందికి ప్రశంసా పత్రంతోపాటు, అ న్ని విధాల సహాయం చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

 

మీకు ఏదైనా సమస్యఉంటే నా వా ట్సాప్ నెంబర్ 70368 36869 నెం బర్ కు మెసేజ్ పంపాలని అలాగే సోషల్ మీడియాకు కో ఆర్డినేటర్ గా శ్రీధర్ రామస్వామి పని చేస్తున్నార న్నారు.మీకు ఏమైనా సమస్య త లె త్తితే వారికి తెలియజేయాలని త దుపరి మీ సమస్యను పరిష్కరించ డం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు, తటస్థ ఓటర్లు,స్వయం సహాయక సంఘా ల మహిళలతో వాట్సప్ గ్రూప్స్, బ్రా డ్ కాస్ట్ గ్రూప్స్,ఛానల్ క్రియేట్ చేసి వారికి మన పోస్టులు చేరే విధంగా చూడాలని సోషల్ మీడియా వారి యర్స్ కు సూచించారు. అదేవిధం గా తప్పుడు ప్రచారం చేస్తున్న వా రిని వెంటనే ఖండించి తగిన గుణ పాఠం చెప్పే విధంగా నిజమైన స మాచారంతో పోస్టులు చేయాలని అన్నారు.

 

ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమా లు, కోదాడ హుజూర్ నగర్ నియో జకవర్గాలలో అభివృద్ధి పనులు ఉ ద్యమంలా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ సైనికుడిగా పని చేయాలని మంత్రి ఆదేశించారుఉద్యోగం చేసుకుం టూ, చదువుకుంటూ, వ్యవసా యం చేసుకుంటూ రోజుకి ఒక గంట చొప్పున సమయం సోషల్ మీడి యాకు కేటాయించాలని, ఆసక్తి , స మయం ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వారియర్ గా పని చేయా లన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 600 పోలింగ్ బూతులు ఉన్నాయని బూతుకి ఒకరు చొప్పున 600 మంది సోషల్ మీడియా వారియర్స్ ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెద్ద ఎత్తు న మహిళలు కూడా సోషల్ మీడి యా వారియర్స్ గా పని చేసేలా చూడాలని ఆదేశించారు.

 

సెప్టెంబర్ 15 వ తారీకున ఇదే స మావేశ మందిరంలో సమావేశం ని ర్వహించి మంచిగా పని చేసిన వా రికి లామినేటెడ్ ఐడి కార్డ్స్ ఇవ్వ డం జరుగుతుందని అలాగే ప్రశం సా పత్రాలు కూడా ఇవ్వడం జరు గుతుందని మంత్రి తెలిపారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఉత్తమ్ ప ద్మావతి ల ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ న్స్ట్రా లను ఫాలో కావడానికి వా టికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్ ఉన్న ఫోస్టర్స్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.