Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

FRS system in Anganwadi : అంగన్వాడీలో ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి

–ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

–తుమ్మల వీరారెడ్డి

FRS system in Anganwadi : ప్రజాదీవెన నల్గొండ : అంగన్వాడీ కేంద్రాలలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరాలు, గర్భిణీ బాలింతలు పౌష్టికాహారం తీసుకునే సందర్భంగా పోశం ట్రాకర్ యాప్ లో కొత్తగా ఫేస్ క్యాప్చర్ సిస్టం ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డి డబ్ల్యు ఓ కృష్ణవేణి లకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించే సమయంలో ఫేస్ క్యాప్చర్ వన్ టైం పాస్వర్డ్ యొక్క ధ్రువీకరణతో ఆధార్ నెంబర్ అనుసంధానించబడిన మొబైల్ నెంబర్ కు పంపుతారు ఏ ఇతర కారణాల వలన నమోదు కానీ ఎడల పౌష్టికాహారం అందించే లిస్టు నుండి పేర్లు తొలగించబడుతాయి. దీనితో పోషకాహారం అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా సరైన నెట్వర్క్ లేక నమోదు కాలేకపోతే పోషకాహారం అందకుండా పోతుందని అన్నారు.

 

ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆన్లైన్ యాప్ ఉండేలా చర్యలు చేపట్టాలని అంగన్వాడీ రిపోర్టింగ్ డిజిటలైజేషన్ సిస్టం అమలుకు ముందు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కంప్యూటర్, ల్యాప్టాప్, 5జి నెట్వర్క్ తో కూడిన మొబైల్ ఫోన్లు అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత వైఫై కనెక్షన్ లేదా డేటాకు తగిన మొత్తం డబ్బులు చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆధార్ ధ్రువీకరణ ఎఫ్ ఆర్ ఎస్ తో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నూతన జాతీయ విద్యా విధానం పూర్తిగా ఐసిడిఎస్ ను ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా స్థానంలో కార్పొరేట్లకు జోక్యం కల్పిస్తూ విద్యార్థులకు సైన్స్ కాకుండా మూఢనమ్మకాలను పెంచే పోషించే విధంగా ఈ విద్యా విధానంలో మార్పులు చేశారని అన్నారు. ఈ ప్రమాదకరమైన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు అంగన్వాడి సంఘాలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు నిరసనలు పోరాటాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. నూతన జాతీయ విద్యా విధానం చట్టం ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్య ద్వారా రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమని అన్నారు. ఇది ఐసిడిఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు పేద ప్రజలకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుందని పేర్కొన్నారు.

 

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అంగన్వాడీలకు కనీస వేతనం 18000 ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు రెండు లక్షలు ఆయనకు లక్ష రూపాయలు చెల్లించాలని, సామాజిక భద్రతా పెన్షన్ అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పై అంశాల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ రెండు నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న అంగన్వాడీ వ్యవస్థ స్కీం వర్కర్ గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని రకాల అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిచేటి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, జిల్లా నాయకులు మణెమ్మ, ప్రమీల, సరిత దాడి అరుణ, పద్మ, లతీఫా, జ్యోతి, చంద్రమ్మ, లలిత, ఫాతిమా, శోభ, విజయ, నీలిమ మరియమ్మ, లక్ష్మీ, స్వప్న, సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, లకపక రాజు తదితరులు పాల్గొన్నారు.