Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Forest Officer Rajashekar : నల్లగొండ అటవీశాఖాధికారి అప్పీ ల్, మానవాళికి మేలు చేసే మొక్క లను విరివిగా పెంచాల్సిన అవసరముoది 

Nalgonda Forest Officer Rajashekar : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మాన వాళికి మేలు చేసే మొక్కలను విరి విగా పెంచాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. వనమహో త్సవం కార్యక్రమంలో భాగంగా మం గళవారం ఆయన నల్గొండ జిల్లా కేం ద్రం లోని రెవెన్యూ డివిజనల్ అధి కారి కార్యాలయ ఆవరణలో సా మాజిక కార్యకర్త సురేష్ గుప్తాతో క లిసి మొక్కలు నాటారు.

 

ఇటీవలి కాలంలో మొక్కలను నా టకపోవడం, అడవులను నాశనం చేయడం తదితర కారణాల వల్ల వాతావరణ అసమతుల్యం ఏర్ప డుతుందని, ఇది భవిష్యత్తులో వా తావరణ సమతుల్యానికి అడ్డంకిగా మారుతుందని, ఈ విషయాన్ని అం దరూ గుర్తించి పెద్ద ఎత్తున మొక్క లు నాటాల్సిన అవసరం ఉందని అ న్నారు.

ఆర్ డిఓ కార్యాలయంలో మొక్క లు నాటడం, ప్రత్యేకించి కార్యాల య ఆవరణ మొత్తం మొక్కలు నా టేందుకు పూనుకోవడం పట్ల ఆయ న ఆర్ డి ఓ అశోక్ రెడ్డిని అభినం దించారు. ప్రభుత్వ కార్యాలయాల లో ఇలాగే అందరు మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని అన్నారు .

 

ఆర్డిఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ త మ కార్యాలయంలో మొక్కల పెం పకంతో పాటు, వాన నీటి సంరక్షణ కు నీటి నిలువ కట్టడాలను ప్రోత్స హిస్తున్నామని, ఇందులో భాగంగా సోక్ ఫిట్ ను తవ్వడం జరిగిందని, దీనివల్ల వాననీరు భూమిలో ఇంకి పోయి భూగర్భ జలాలు పెరిగేందు కు ఆస్కారం ఉందని, కార్యాలయ ఆవరణ మొత్తం పూలు ,పండ్లను ఇచ్చే మొక్క లని నాటేందుకు ని శ్చయించడం జరిగిందని, దీని వల న చుట్టుపక్కల వాతావరణం ఆహ్లా దకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సురేష్ గుప్త ఉన్నారు.