Big Breaking : ప్రజాదీవెన, నల్గొండ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేసినందుకు గాను సూర్యపేట జిల్లా పాలకీడు మండలం, జాన్ పహాడ్ గ్రేడ్- 4 గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్యను విధుల నుండి సస్పెం డ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.
జాన్ పహాడ్ గ్రామపంచాయతీ
కార్యదర్శి ఇ. వెంకయ్య గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుం డి లంచం డిమాండ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కిం ద లబ్ధిదారుల నుండి లంచం డి మాండ్ చేసి విధులపట్ల నిర్లక్ష్యం వహించినందుకుగాను, జాన్ ప హాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్యను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్త ర్వులలో పేర్కొన్నారు.
క్రమశిక్షణ ప్రక్రియ పూర్తయ్యేంతవ రకు వెంకయ్య సస్పెన్షన్ లో కొనసా గుతారని, సస్పెన్షన్ సమయంలో ఎట్టి పరిస్థితులలో జాన్ పహాడ్ ను వదిలి వెళ్ళకూడదని ఆ ఉత్త ర్వులలో పేర్కొన్నారు.కాగా జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ. వెంకయ్య మొదటి విడత ఇంది రమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి లం చం డిమాండ్ చేస్తున్నట్లు వివిధ దినపత్రికలలో వార్తలు వచ్చిన విష యం తెలిసిందే. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సమగ్ర విచారణ కు కలెక్టర్ ఆదేశిం చిన విషయం తెలిసిందే. ఇందిర మ్మ ఇండ్ల విషయంలో ఎవరు డ బ్బులు డిమాండ్ చేసినా, లంచం తీసుకున్నా, నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అలాంటి వారిని విధుల నుండి సస్పెండ్ చే యడమే కాకుండా, క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని హెచ్చరిం చారు.