Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suryapet Collector Tejas Nand Lal : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ స్పష్టీకరణ, ప్రశాంత వాతావర ణంలో గణేష్ ఉత్సవాలు

Suryapet Collector Tejas Nand Lal : ప్రజాదీవెన, సూర్యాపేట: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు గురువారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కే నర్సింహతో కలిసి జిల్లా కలె క్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గణేష్ నవరాత్రులులలో ఎ లాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మండపాలలో షార్ట్ సర్క్యూట్స్ జర గకుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకో వాలని, పంచాయతీ అధికారుల, మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహిం చాలని,మండపాల వద్దకు రోడ్డు ఏ ర్పాటు చేయాలని,చిన్నపిల్లలకి వృద్ధులకి నిమజ్జనం వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని,నిమజ్జనం అయిపో గానే వాహనాలు వెళ్లిపోయేలా ప్ర ణాళికలు సిద్ధం చేయాలని మున్సి పాలిటీలలో శోభయాత్రని నిర్వ హించేటప్పుడు చెట్లు అడ్డు తగల కుండా కొమ్మలు తొలగించాలని, రోడ్లపై గుంటలు పుడ్చాలని,స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని,భక్తులకు త్రాగునీరు వసతి కల్పించాలని,నిమజ్జనం చేసే ప్రదేశాలకు రూట్ మ్యాప్ తయారు చేయాలని,నిమ్మజనం చేసే ప్రదేశా లలో వాహనాలు ప్రవేశించేందుకు, బయటికి వెళ్లేందుకు వేరు వేరు రో డ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఆర్డీవోలు,డిఎస్పీలు తమ సి బ్బందిచే క్షేత్ర స్థాయి పర్యటన చేపించి తర్వాత కార్యచరణరూపొందించుకోవాలని,ఎంపీడీవోలతో,గ్రామపంచాయతీ అధికారులతో జడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి సమావేశం నిర్వహించి ప్రతి గ్రామం లో మండపాల వద్ద తీసుకోవాల్సిన చర్యలు అధికారులకు సూచించా లని ఆదేశించారు.వైద్య ఆరోగ్య శా ఖ సిబ్బంది పీహెచ్ సి సబ్ సెం ట ర్లు ,ఏరియా హాస్పిటల్ లో, అత్య వసర సేవలకు తగినట్లు గా ఏర్పా టు చేసుకోవాలని నిమజ్జ నం చేసే ప్రదేశంలో హెల్త్ క్యాప్ ని ర్వహించా లని ఆదేశించారు. పెద్ద లందరూ యువతకు పలు సూచన లు చేస్తూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమం జరిగే విధం గా ప్రతి ఒక్కరూ సహక రించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించా రు.

 

నిమజ్జనం చేసే ప్రదేశాలలో మండ పాలలో మహిళా భద్రతకే ప్రాధాన్య త ఇస్తామని,నిమజ్జనం చేసే ప్రదే శంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేయా లని, నవరాత్రులు పాటు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏ ర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పండుగను ఆహ్లాదకర వాతావరణం లో జరుపుకునే విధం గా సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

ఎస్పీ కే నరసింహ మాట్లాడుతూ ప్ర జలను రక్షించేందుకు పోలీస్ శాఖ ముందుగా ఉంటుందని శాంతిభద్ర లకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసు కుంటే దాన్ని తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి పోలీస్ స్టేషన్లో గాని మొబైల్ ద్వారా గాని ఆన్లైన్లో ప్రతి మండపాన్ని రిజి స్ట్రేషన్ చేసుకోవాలని సూచించా రు.నవరాత్రులలో ఎలాంటి సం ఘ టన జరగకుండా ప్రజల రక్షణ కొర కు కొన్ని నిబంధనలు ఉంటాయ ని,వాటిని ప్రతి ఒక్కరు పాటించాల ని, ప్రతి మండపము వద్ద సీసీటీవీ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి దని,నిమజ్జనం రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సమ యంలో నిమజ్జనం చేసుకుంటే అందరికీ సౌకర్యంగా ఉంటుందని సూ చించారు.

నిమజ్జనం రోజు డ్రైవర్లు ఒక వా హనానికి ఒక్క డ్రైవర్ని ఉంచుకో నేలా అదేవిధంగా మందు తాగకుం డా, మొబైల్ ఉపయోగిం చకుం డా,నెమ్మదిగా వాహనం నడిపే విధంగా చూడాలని,ఆరోజు కచ్చి తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ని ర్వహించడం జరుగుతుందని అ న్నారు. ప్రతి ఒక్కరూ నియమ ని బంధనలు పాటిస్తూ సంస్కృతి సం ప్రదాయాలను గౌరవిస్తూ పండగ ఉ న్నత్యాన్ని పెంపొందించేలా చూడా లని ఈ సందర్భంగా ఎస్పీ సూచిం చారు.

 

అంతకు ముందు భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వి శ్వ హిందూ పరిషత్ సభ్యులైన కృ పా కర్ , రుప్మా రావు, రాజేశ్వరరా వు, నరసింహారావు,షేక్ ఫరూక్, పాం డురంగ చారి,విజయ్ కృష్ణ, ర వి చంద్ర మాట్లాడుతూ గణేష్ ఉత్స వాలు ప్రశాంతంగా శాంతియుతం వాతావరణంలో నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామ ని, నిమజ్జనం చేసే సద్దలచెరువు వద్ద ఏర్పాటు చేయాలని, మున్సి పాలిటీ ద్వారా శానిటేషన్ నిర్వహిం చాలని, ముఖ్యమైన ప్రదేశాల్లో విగ్ర హాలను నిమజ్జనం చేసేందుకు క్రే న్లు, లైటింగ్స్ ఏర్పాటు చేయాల ని, రోడ్డుపై గుంతలు పూడ్చాలని, వి ద్యుత్ ప్రమాదాలు జరగకుండా చ ర్యలు తీసుకోవాలని, రోడ్డుకి అ డ్డంగా ఉన్న చెట్లను తొలగించాలని ఈ సందర్భంగా కోరారు.అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీవోలు, డి ఎస్పీలు,మున్సిపల్ కమిషనర్లు, జి ల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు,భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, రుక్మా రావు,రాజేశ్వరరావు,రమేష్,ఉపేందర్,నరసింహారావు, జయ కృష్ణ, షే క్ ఫరూక్,రవిచంద్ర, ప్రభాకర్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదిత రులు ఈ సమావేశానికి హాజర య్యారు.