Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, భావితరాల కోసమే మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: సాధార ణంగానే ఏదైనా మంచి పని చేసేట ప్పుడు కొందరూ కావాలనే అడ్డుప డుతుంటారు, మూసీ విషయంలో నూ ఇదే జరుగుతోంది, భావితరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతామని, వెనక్కి తగ్గేదే లేదని, నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తె లంగాణను రోల్ మోడల్ గా నిలు పుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్ప ష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలం గాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యం లో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ‘పాల సీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బ యోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరె న్స్ ను ఆయన లాంఛనంగా ప్రారం భించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నగరాల అభివృద్ధికి సరైన ప్ర ణాళికే పునాదని అన్నారు. పర్యా వరణం, సుస్థిరత లేకుండా ఆర్థికా భివృద్ధి సాధ్యం కాదన్నారు. భవ నాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యా వరణ పరిరక్షణతో కూడిన వృద్ధి వ శ్యకమన్నారు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని నొక్కి చెప్పారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పున రుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి – ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించా రు.

 

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభి వృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జ ల సంరక్షణ, సుస్థిర రవాణాలో తె లంగాణ అవలంభిస్తున్న విధానా లు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాం కేతికతను సమర్థవంతంగా విని యోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చే యోచ్చన్నారు. వాతావరణ మా ర్పులు, పట్టణ వరదలు, పర్యావర ణ కాలుష్యం, భూగర్భ జలాల త రుగుదల, పట్టణీకరణ, తరిగిపోతు న్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళిక లను రూపొందించాలని సూచించా రు.

ఈ కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసి డెం ట్ ఎన్ కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్(టెక్నో అడ్మి న్) ప్రదీప్ కుమార్, ఐటీపీఐ – తె లంగాణ రీజినల్ ఛాప్టర్ ఛైర్మన్ ఎ స్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె. ము రళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.