PPR vaccination : పశువైద్య, పశుసంవర్ధక శాఖ కీలక ప్రకటన,గొర్రెలు మేకలలో పిపిఆర్ వ్యాధి నిరోధక టీకాలకు సంసిద్ధం
PPR vaccination : ప్రజా దీవెన, నల్లగొండ: గొర్రెలు, మే కలలో పిపిఆర్ వ్యాధి నిరోధక టీ కాలు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 10 వరకు అన్ని గ్రామాలలో వేయ టానికి ఏర్పాట్లు చేయటం జరిగిం దని పశు వైద్యాధికారి రమేష్ తెలి పారు. నల్లగొండ జిల్లాలోని పశు వై ద్య సిబ్బంది 54 బృందాలుగా ఏ ర్పడి అన్ని గ్రామాల్లో టీకాలు కార్య క్రమం చేపడతారు పిపిఆర్ వ్యాధి చాలా ప్రాణాంతకమైనది. దీనివ లన గొర్రెలు, మేకల్లో మరణాలు సం భవిస్తాయి ముందు జాగ్రత్తగా టీకా లు వేయించుకున్నట్లయితే, జీవా లను వ్యాధి నుండి కాపాడవచ్చు జీ వాల పెంపకందారులు ఈ సదవకా శాన్ని వినియోగించుకొని మీ జీ వా లను ఆరోగ్యంగా ఉంచుకోవా ల్సిం దిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
*వ్యాధి వ్యాప్తి చెందే విధానం*
గొర్రెలు మరియు మేకలలో మార్బిల్లి వైరస్ వలన పెస్టిడిస్ పెటైటిస్ రూమి నాంట్స్ ( పి. పి. ఆర్. ) అనే అంటు వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి జీవాలకు సరైన గాలి వెలుతురు అందకపోవడం, కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా మరియు వర్షాల వల్ల వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త జీవాలను కొనుగోలు చేసి మందలో కలపడం ద్వారా ఇతర జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధిగ్రస్త జీవాలు విసర్జించే పేడ మరియు ఇతర స్రావాల ద్వారా ఈ వ్యాధి ఇతర జీవాలకు సోకుతుంది.
*వ్యాధి లక్షణాలు* :ఈ వ్యాధి సో కిన గొర్రెలు, మేకలలో అధిక జ్వరం రావడం, కంటి నుండి మరియు ముక్కు నుండి నీరు కారడం, నోటి లో పొక్కులు ఏర్పడటం, జిగురుతో కూడిన విరోచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే దీ నిని పారుడు వ్యాధి అని కూడా అంటారు. ఇంకా వ్యాధి ముదిరిన ప్పుడు ముక్కు నుండి చీము కార డం, నోటిలోని చిగుళ్లపై, నాలుక పై పుండ్లు (అల్సర్స్) రావడం జరుగు తుంది. వ్యాధిగ్రస్త జీవాలలో ఆకలి మందగించి పోవడం, మేత మేయక పోవడం, అధిక విరోచనాలు మరి యు దగ్గుతో కూడిన బ్రాంకో ని మో నియా వంటి లక్షణాలతో 5 నుండి 10 రోజులలో మరణాలు సంభవి స్తాయి.
*వ్యాధి నిర్ధారణ :* చనిపోయిన జీవాల శవ పరీక్ష చేసినపుడు చి న్నప్రేగులు మరియు పెద్ద ప్రేగులలో రక్తపు చారలు (జీబ్రా మార్కింగ్స్ ) కనిపించుట ద్వారా మరియు పైన తెలిపిన శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చును. వ్యాధి గ్రస్త జీవాల నుండి రక్త నమూనాల ను మరియు చనిపోయిన జీవాల నుండి ప్రేగు యొక్క సోషరస కణి తులను, ఊపిరితిత్తులు, ప్లీహము వంటి నమూనాలను సేకరించి ప్ర యోగశాలకు పంపించి వ్యాధిని ని ర్ధారించవచ్చును.
*వ్యాధి చికిత్స* : ఈ వ్యాధికి స రైన చికిత్స లేదు. పశు వైద్యశాలని సంప్రదించి చికిత్సను అందించుట
ద్వారా వ్యాధిగ్రస్త జీవాలను కాపా డుకొనవచ్చును. పశు వైద్యుని సలహా మేరకు వ్యాధి లక్షణాలను బట్టి యాంటీ బయాటిక్ మందులు మరియు యాంటీ పైరటిక్ మందు లు వాడుకోవాలి. నోటి పుండ్లు తగ్గ డానికి బోరిక్ ఆసిడ్ కలిపిన గ్లిజరి న్ ను పూయాలి. మేతమేయని జీ వాలకు జావ, అంబలి త్రాగించడం చేయాలి.
*వ్యాధి నివారణ:* పి. పి. ఆర్. వ్యాధి అంటువ్యాధి కావున వ్యాధి సోకిన జీవాలను వెంటనే ఆరోగ్య వంతమైన జీవాల నుండి వేరు చేసి చికిత్స అందించాలి. కొత్తగా కొను గోలు చేసిన జీవాలను కొన్ని రోజు లు వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించిన తర్వాతనే మందలో కలపాలి. ఈ వ్యాధిని నివారించ డానికి వ్యాధి సోకక ముందే పి. పి.ఆర్. టీకాలు వేయించాలి ము ఖ్యంగా ఈ వ్యాధి సంవత్సరం వయస్సు లోపు ఉన్న పిల్లల్లో ఎ క్కువగా వస్తుంది కావున వాటికి తప్పనిసరిగా టీకాలు వేయించాలి. టీకాలను 4 నెలలు ఆపైన వయ స్సు ఉన్న గొర్రెలు, మేకలు అన్నిం టికి 1 మి.లీ. చొప్పున చర్మం కింద వేయించాలి. తద్వారా పి పి ఆర్ వ్యాధి రాకుండా అరికట్ట వచ్చును.