Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gandhi Hospital : గాంధీ వైద్యుల వండర్, బ్లేడ్లు మిం గిన ఆటోడ్రైవర్, ఆపరేషన్ లేకుండా బయటకు తీసిన వైనం 

Gandhi Hospital : ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రా బాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అ రుదైన వండర్ సాధించారు. కు టుంబకలహాల కారణంగా క్షణికా వేశంలో 8 షేవింగ్ బ్లేడ్లను ముక్క లు చేసి మింగేసిన ఓ వ్యక్తికి ఎలాం టి శస్త్రచికిత్స చేయకుండానే వైద్యు లు తొలగించారు. అత్యంత క్లిష్టమై న ఈ కేసులో వైద్యులు తమ నైపు ణ్యంతో మూడు రోజుల్లోనే కడుపు లోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించా రు.

మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా (37)కు భార్య, ఇద్దరు పి ల్లలు ఉన్నారు. ఈ నెల 16న కు టుంబంలో జరిగిన గొడవతో ఆవే శానికి లోనైన ఖాజా 8 షేవింగ్ బ్లే డ్లను రెండేసి ముక్కలుగా చేసి మిం గేశాడు. కాసేపటికే కడుపులో తీవ్ర మైన నొప్పి రావడంతో తాను బత కనంటూ ఏడవటం మొదలుపెట్టా డు. భయాందోళనకు గురైన కుటుం బ సభ్యులు వెంటనే అతడిని గాం ధీ ఆసుపత్రికి తరలించారు.

జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొ ఫెసర్ సునీల్ కుమార్ నేతృత్వం లోని వైద్య బృందం వెంటనే స్పం దించి ఎక్స్‌రే, సీటీ స్కాన్ తీసింది. ఖాజా పొట్టలో బ్లేడ్ ముక్కలు ఉన్న ట్టు నిర్ధారించుకున్నారు. తొలుత ఎండోస్కోపీ ద్వారా వాటిని తీయా లని భావించినా, ఆ ప్రక్రియలో అ న్నవాహిక, ఇతర అవయవాలకు గాయాలై రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో శస్త్రచికి త్స లేకుండానే, ప్రత్యామ్నాయ మా ర్గంలో చికిత్స అందించాలని నిర్ణ యించారు.

వైద్యులు ‘ప్రోటాన్ పంప్’ అనే ప్రత్యే క వైద్య ప్రక్రియను ఎంచుకున్నారు. ఖాజాకు ఆహారం, నీరు పూర్తిగా ని లిపివేసి, ఇంట్రావీనస్ (ఐవీ) ద్వారా ద్రవాలను ఎక్కించారు. ఈ విధానం ద్వారా బ్లేడ్ ముక్కలు నెమ్మదిగా క దులుతూ మల విసర్జన ద్వారా బ యటకు వచ్చేలా చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ చికిత్సలో, బ్లేడ్ ముక్కలన్నీ పూర్తిగా బయట కు వచ్చేశాయి. అనంతరం మరోసా రి ఎక్స్‌రే తీసి కడుపులో ఎలాంటి ముక్కలూ లేవని నిర్ధారించుకున్నా క వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.

బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఈ నెల 21న ఆసుపత్రి నుంచి డి శ్చార్జ్ చేశామని, ఆసుపత్రి అడిషన ల్ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్ డాక్ట ర్ సునీల్ నిన్న మీడియాకు వెల్లడిం చారు. అత్యంత ప్రమాదకరమైన స్థి తిలో ఉన్న రోగి ప్రాణాలను శస్త్రచికి త్స లేకుండా కాపాడిన గాంధీ వై ద్యుల బృందాన్ని పలువురు అభి నందించారు.