Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల్లో ప్రభుత్వం సంపూర్ణ మద్దతు

CM Revanth Reddy : ప్రజా దీవెన,హైదరాబాద్: బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవి ష్కరణలకు అవసరమైన మద్దతు ను ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభు త్వం నిబద్ధతతో పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చె ప్పారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పి టల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసి యా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొ వేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్య మంత్రి పాల్గొన్నారు. ఈ వేదికగా “ఇన్నొవేషన్ ఆఫ్ భారత్ – ది బ యోడిజైన్ బ్లూప్రింట్‌”ను ఆవిష్క రించారు.

ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మా ట్లాడుతూ బయోడిజైన్ విధానం ఉ పయోగించి వైద్య ఉత్పత్తుల ఆవి ష్కరణల విషయంలో ప్రభుత్వం అ న్ని విధాలుగా మద్దతునిస్తుందని చె ప్పారు. మాన్యుఫాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేం ద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెం దడం శుభసూచకమన్నారు. భార తదేశంలో ఆరోగ్య సంరక్షణ, ఎదుర వుతున్న సవాళ్లను అధిగమించడా నికి స్వదేశీ ఆవిష్కరణలు ఎంతో అ వసరం. అలాంటి పరిశోధనలకు, ఆ విష్కరణల కోసం తెలంగాణ మద్ద తునివ్వడమే కాకుండా వైద్య డేటా ను డేటా గోప్యతా ప్రమాణాలకు లో బడి అందించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు.

నూతన ఆవిష్కరణల కోసం విద్యా సంస్థలు, పరిశోధనాసంస్థలు, యం గ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములతో అను సంధానం చేస్తామని , చాలా ఏళ్లు గా మనమేదస్సు ఇతర దేశాల స మస్యల పరిష్కారానికి ఉపయోగప డుతోందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రతిభ పాటవాలు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉ పయోగించాల్సిన సమయం వ చ్చిందని చెప్పారు.

 

బయోడిజైన్ విధానం క్లినికల్ అ వ సరాలకు, ఆచరణాత్మక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తా యి. ఈ రంగంలో ఏఐజీ హాస్పిట ల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి నాయకత్వంలో నూతన ఆవిష్కర ణల కోసం పరిశోధనా కార్యక్రమా లు కొనసాగించడం అభినందనీ యమన్నారు. లైఫ్ సైన్సెస్ రం గం లో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని, ముఖ్యం గా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమే జింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నా లజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు వచ్చా యని, తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విజన్‌తో ముందుకు వె ళుతోందన్నారు. 2034 నాటికి 1 ట్రి లియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలం గాణ రైజింగ్ లక్ష్యంతో పనిచేస్తు న్నామని స్పష్టం చేశారు.

వైద్య రంగంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసం సుల్తాన్‌పూర్‌లో దే శంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశాం. అక్కడ 60 కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్నాయని తెలిపారు. వివి ధ రంగాల్లో హైదరాబాద్ ఒక ప్రత్యే కమైన కేంద్రంగా ఎదగడంలో స్థానిక స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం ఎంతో ఉంద న్నారు. ఈ సమ్మిట్‌లో ఏఐజీ హా స్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, బయోడిజైన్ ఇన్నొవేషన్ స మ్మిట్ చైర్మన్ డాక్టర్ రాజేశ్ కలపల, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, సెంటర్ ఫర్ బయోడిజైన్ (స్టాన్ ఫో ర్డ్ యూనివర్సిటీ) డైరెక్టర్ డాక్టర్ అ నురాగ్ మైరల్ తో పాటు వైద్య పరి శోధనా రంగంలో వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొ న్నారు.