Former Minister Harish : మాజీమంత్రి హరీశ్ ఘాటువ్యాఖ్య, బీఆర్ఎస్ హయాo పనులకు రిబ్బ న్ కటింగ్ కు రేవంత్ జేబులో కత్తెర
Former Minister Harish : ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ ఎ స్ హయాంలో చేపట్టిన, ప్రారంభిం చిన పనులకు రిబ్బన్ కట్ చేసేందు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబు లో కత్తెర పెట్టుకొని తిరుగుతు న్నా డని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమ యంలో ఆరుగ్యారెంటీలు 4 హామీ ల పేరుతో ప్రజలను మోసం చేశార ని, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థుల ను మూడు రోజుల ముందే అరెస్ట్ చేస్తున్నారని, గజానికో పోలీసోన్ని పెట్టి ఇనుప కంచెల మధ్య, నిర్బం ధాల మధ్య యూనివర్సిటీని ఉద్ధ రిస్థాయని మాట్లాడుతున్నాడని,
రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన బిల్డింగ్ ని ప్రా రంభించడానికి పోయాడని ఆరో పించారు. టిఆర్ఎస్ హయాం లోని పనులకు ప్రారంభాలు చేసేందుకు
రేవంత్ రెడ్డి కట్టర్ జేబులో పెట్టుకొ ని తిరుగుతున్నాడని, బీఆర్ఎస్ ప్రారంభించిన పనులకు రిబ్బన్ లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడ ని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇం దిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసం గించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే..రేవంత్ రెడ్డి ఒక దవఖాన కట్టింది లేదు. బి ల్డింగ్ కట్టింది లేదు. రేవంత్ రెడ్డి ఎ న్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్త లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మా టతప్పడం దుర్మార్గo. స్థానిక సం స్థల ఎన్నికల లోపు ఆశా కార్యకర్త లను పిలిపించి మాట్లాడి సమస్య లు పరిష్కరించాలి.లేకపోతే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కాంగ్రెస్ ప్రభు త్వానికి బుద్ధి చెబుదాం.అసెంబ్లీని స్తంభింప చేసి అయి నా సరే మీ హ క్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చే స్తుంది.
రూ. 50 వేల కోట్లకు కాంట్రాక్టులు పిలిచిన ప్రభుత్వానికి ఆశా కార్యక ర్తలకు జీతం ఇవ్వడానికి డబ్బులు లేవా, ఆశా కార్యకర్తలు గొంతెమ్మ కో రికలు కోరడం లేదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో మమ్మల్ని గెలిపించండి మీకు ఫి క్స్డ్ వేతనం ఇస్తామని మాట ఇ చ్చింది. రేవంత్ రెడ్డి మీరు ఏ మా టిచ్చారో ఆ మాట నెరవేర్చండని మీరు అడుగుతున్నారు ఇది కొత్త వి షయం కాదు. గొంతెమ్మ కోరిక అస లే కాదు. కోటిలో హెల్త్ డైరెక్టరేట్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసు లను పెట్టి కొట్టించారు.
మీరు ప్రభుత్వానికి టైం ఇచ్చారు పరిష్కరించడానికి. ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా లే దంటే ఉద్యమించమంటారా.
ప్రభుత్వం దగ్గర పైసలు లేవా కమి షన్లకు వచ్చే దగ్గర మాత్రం ప్రభు త్వానికి పైసలు ఉంటాయి. HMW Sలో భాగంగా మల్లన్న సాగర్ నుం డి హైదరాబాదుకు గోదావరి కాళే శ్వరం నీళ్లను తెచ్చి మూసి మోరీ లు పూస్తా అని అంటున్నాడు. గో దావరి నీళ్లను మూసిలో పోసేం దు కు 6000 కోట్లను ఈ ప్రభుత్వం ఖ ర్చు పెడుతుందని చెప్తున్నారు.
HMWS లో 4000 కోట్ల రూపా య లతో ఎస్టీపీలను రేవంత్ రెడ్డి పెడు తున్నాడు కమీషన్లు, కాంట్రాక్టుల కో సం. HMDA పదివేల కోట్లతో టెం డర్లు పిలిచారు. GHMC లో 6000 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇరిగే షన్ శాఖలో 10,000 కోట్ల రూపా యలకు టెండర్లు పిలిచారు. ఫ్యూ చర్ సిటీలో ఆరు లైన్ల రహదారి కో సం టెండర్లు పిలిచారు. అక్కడ సి టీ లేదు ఏమి లేదు. వీళ్ళు వీళ్ళ చు ట్టాల భూములు ఉన్నాయి. వీట న్నింటికీ మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశ కార్యకర్తలకు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు.
ఈ 50 వేల కోట్ల కాంట్రాక్టు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి.మా ఆశాలకు, అంగన్వాడీలకు మధ్యా హ్న భోజన కార్మికులకు జీతాలు ఇ వ్వమంటే పైసలు ఇవ్వనంటావా.
మాట తప్పావు రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ లేదు. మా ఉద్యోగులు డీఏ అడిగినా, జీపీఎఫ్ గురించి అ డిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అం గన్వాడీలు అడిగినా డబ్బులు లేవు అని చెబుతావు.
ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అన్నా వు 250 కోట్లతో పదివేల కోట్లతో టెండర్లు పిలిచారు. పేద ప్రజల ఆ రోగ్యం కోసం, ఊర్లలో పేదవారికి సేవ చేసే ఆశాలంటే ఎందుకు చిన్న చూపు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలను ఎంత మంచిగా గౌరవించారో గుర్తు తెచ్చుకోండి. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవులు పనిచేసి ప్రజల ప్రా ణాలు కాపాడిన ఆశా వర్కర్ల విష యంలో మాట తప్పడం అన్యా యం. ఆనాడు 2,200 ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని 10,000 కి పెంచు కున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు మీక్కూడా జీతాలను పెంచా రు కేసీఆర్.
రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు సం పా దన పెంచుడు తెలుసు పంచుడు తెలుసు అన్నాడు. సంపద పెంచు డు నువ్వు నీ కుటుంబ సభ్యులు దంచుకొనుడు తప్ప పేదలకు పెట్టే సోయి నీకు లేదు. ఆశాలు, అంగ న్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ల గురించి ఎందుకు మాట్లాడటం లే దు. ఊర్లలో ఆసుపత్రిలో బీపీకి వా డే టేల్మా గోళీలు కూడా దొరకని ప రిస్థితి నెలకొంది. గతంలో టేల్మా గోళీలు కావాలి ప్రజలు అడుగుతు న్నారని మీరు నాకు చెప్తే మన గవ ర్నమెంట్ బిపి కి టెల్మా గోలీలను తె చ్చి అందించాం.
గ్రామ పంచాయ తీలకు హెల్త్ డి పార్ట్మెంట్ ద్వారా స్పె షల్ డ్రైవ్ కి కొంత డబ్బును కేటాయించేవాళ్ళం.
శానిటేషన్ డబ్బులు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. గ్రామపంచాయతీలో ట్రా క్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి ఈ ప్ర భుత్వంలో లేదు. గ్రామాల్లో విష జ్వ రాలు విజ్రుంభించి ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు.
చెత్త సేకరణ లేదు. బ్లీచింగ్ పౌడర్ లేదు. గ్రామాలు నిర్వీరమైపోయా యి. దౌఖానకు పోతే సూది లేదు గోలి లేదు. రేవంత్ రెడ్డి రేపో మాపో పంచాయతీ ఎలక్షన్లు పెడతా అం టున్నావ్. ఎలక్షన్లలోపు ఆశ కార్య కర్తలను పిలిచి మాట్లాడి వారి కోరి కలను నెరవేర్చాలని డిమాండ్ చే స్తున్నాం.
లేకపోతే ఆశాలు స్థానిక సంస్థల ఎ న్నికల్లో ఏం చేస్తారో నేను చెప్పనవ సరం లేదు వాళ్లే చేసి చూపిస్తారు.
రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలో రెం డు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మో సం చేశాడు. ఇప్పటివరకు పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ము క్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు రెండు ఏండ్ల నుండి స్కాలర్షిప్ లేదు.
ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని మో సం. కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం అని మోసం. దమ్ముంటే గ న్మెన్లు లేకుండా, పోలీసులు లేకుం డా యూనివర్సిటీకి రా రేవంత్ రెడ్డి.
ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి ఉస్మా నియా యూనివర్సిటీకి వస్తే విద్యా ర్థులు తరిమికొట్టారు. సందులో ప డి పారిపోయాడు రేవంత్ రెడ్డి తె లంగాణ ఉద్యమంలో. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఇ చ్చిన హామీలు అమలు చేయనం దుకు బేషరతుగా క్షమాపణ చెప్పా లి.
మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు బి ల్లులు లేదు. అన్నం పెట్టిన కార్మికు లకు 6 నెలల జీతాలు లేవు. కాంగ్రె స్ క్యాబినెట్లో ఇద్దరు మహిళా మం త్రులు ఉన్నా మహిళలయిన ఆశా లు, అంగన్వాడీలు ఎందుకు రోడ్ల పైకి వస్తున్నారు. సురేఖమ్మ, సీతక్క రాఖీ కట్టినప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేదు. అవసరమైతే అసెంబ్లీని స్తంభింప చేసి మీ ఈ స మస్యల పరిష్కారం కోసం పోరాడు తాం. మీకు అండగా బీఆర్ఎస్ పా ర్టీ ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ కా ర్యక్రమాలన్నీ ఆశాలకు అందించా ల్సిందే.
ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయ డం లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆశాలకు రావలసి నవి కూడా ఇవ్వడం లేదు.
30వ తారీఖులోగా మా బిల్లులు ఇ వ్వకపోతే ప్రైవేట్ హాస్పిటళ్లు ఆరో గ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పా రు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయండి. బీఆర్ఎస్ ప్ర భుత్వంలో ఆశా కార్యకర్తలకు నెల చివరి రోజున జీతాలు వేసేవాళ్ళం. ఉద్యోగులకు ఆపైనా సరే మీకు మా త్రం ఫస్ట్ తారీకులోపే వేసేవాళ్ళు.
రేవంత్ రెడ్డికి ఆశాలన్నా అంగ న్వా డీలన్నా చిన్నచూపు.గురుకుల హా స్టల్లో 6 నెలల నుండి మెస్ బిల్లు లు, ఏడు నెలల నుంచి కాస్మోటిక్ చార్జెస్ లెవ్వు అని విద్యార్థులు ఆవే దన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ పె ట్టి గురుకులాల బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మా ట తప్పాడు.ముఖ్యమంత్రి కుర్చీ కుండే విలువ కూడా రేవంత్ రెడ్డి దిగజార్చాడని తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు.