గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్బుతమని ప్రశంసలు
గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం అద్బుతమని ప్రశంసలు
ప్రజా దీవెన/ముంబాయి :ప్రకృతి సంస్కృతి రెండే మన భవిష్యత్తు గ్రీన్ ఇండియా చాలెంజ్ సహకారంతో పండరిపురంలో తులసి మొక్కలు పంపిణీ కార్యక్రమం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తొలి ఏకాదశి పురస్కరించుకుని రెండు రోజులు మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం పండరీపురంలో విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కలు వార్కరి సాంప్రదాయకులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోలాపూర్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు భగీరథ భారతి బాల్కే గారు తులసి మొక్కలను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా భగీరథ భారతి బాల్కే గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా సృష్టికర్త శ్రీ జోగినిపల్లి సంతోష్ దూర దృష్టితో పర్యావరణ పరిరక్షణ పట్ల వీరు తీసుకున్న సంకల్పం అద్భుతమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా వార్కరి సాంప్రదాయకులు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తులసి మొక్కలను పంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా సభ్యులు రాఘవ పర్యావరణ కార్యకర్త పాలడుగు జ్ఞానేశ్వర్ , పూర్ణ, మహారాష్ట్ర వార్కరి సాంప్రదాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
సర్వేజనా సుఖినోభవంతు పర్యావరణ పరిరక్షణ మన వంతు…