CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వందేళ్ల అవసరాలను దృష్టితో మూ సీ నదీ పరివాహక ప్రాంతం అభివృ ద్ధి జరగాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరా లను దృష్టిలో ఉంచుకొని మూసీ న దీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జ రగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివా సంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
గేట్ వే ఆఫ్ హైదరా బాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు రోడ్ల అభి వృద్ధి వంటి అం శాల్లో ముఖ్యమంత్రి పలు సూచన లు చేశారు. మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా,భవిష్యత్తు అవసరాల ను దృ ష్టిలో ఉంచుకొని సిగ్నల్ ర హిత జంక్షన్లను ఏర్పాటు చేయా లని చెప్పారు.
గాంధీ సరోవర్ అభివృద్ధికి సం బం ధించిన పలు డిజైన్లను పరిశీలిం చారు. అభివృద్ధి పర్యావరణ హి తంగా ఉండేలా ప్రణాళికలు ఉండా లని సూచించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువు అభివృద్ధి, ఐకాని క్ బ్రిడ్జి నిర్మాణ ప్రణాళికలను అధి కారులు ముఖ్యమంత్రికి వివరించా రు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనం త త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పను లు మొదలు పెట్టాలని అధికారుల ను ఆదేశించారు.ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పరిశ్రమలు, మున్సిప ల్ – పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎం డీఏ (HMDA), హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ (HMWSSB), ఎంఆర్‌డీ సీఎల్ (MRDCL) ఉన్నతాధికారు లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.