Nalgonda Murder : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణహత్య చో టు చేసుకుంది. గురువారం తెల్ల వా రుజామున హత్య జరిగిన విష యం దావాణంలా వ్యాపించడంతో కలకలం రేకెత్తించింది. మృతుడు నల్లగొండ జిల్లా వడ్లపల్లి గ్రామం నాంపల్లి మండలంకు చెందిన యు వకుడు రమేష్ (35) అని పోలీసు లు గుర్తించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవర కొండరోడ్డు ప్రతీక్ రెడ్డి జూనియర్ క ళాశాల, అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఘటన జరిగింది. సంఘటన స్థలా నికి చేరుకున్న నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి హ త్యకు గల కారణాలు ఆరా తీస్తు న్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరు పుతున్నారు.
ఇదిలా ఉండగా స్థానికుల వివరాల ప్రకారం కొన్నేళ్లుగా బండకింది రమే ష్ బిటిఎస్ కాలనీ లో ఒక ఇంటిలో అద్దెకు ఉన్నట్లు సమాచారం. మూ డు నెలల నుంచి భార్యాభర్తల మ ధ్య అంతర్గత విభేదాలు నడుస్తు న్నట్లు తెలుస్తోంది.మూడు నెలల క్రితమే రమేష్ తో విభేదాలు ఏర్పడి భార్య పుట్టింటికి వెళ్ళినట్లు ప్రాథ మికoగా కుటుంబ కలహాల కారణం తో రమే ష్ ను హత్య జరిగిందా లే దంటే ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో నల్లగొండ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. మ రిన్ని పూర్తి వివరాలు తెలియాల్సిం ది.