Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hyderabad Artificial Beach : భాగ్యనగర వాసులకు తీపికబురు, మానవ నిర్మిత సరస్సుతో భారీ ఆర్టి ఫిషియల్ బీచ్ నిర్మాణానికి రంగం సిద్ధం 

Hyderabad Artificial Beach : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ వాసుల ముందు బీచ్ అందా లు ఆవిష్కృతం చేసేందుకు తెలం గాణ రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ వాసులు బీచ్ అం దాలు ఆస్వాదించాలంటే ముత్యా ల నగరం పర్యాటక ప్రాంతాలకు నెలవు కావడం, అద్భుతమైన కట్ట డాలు, ఆకట్టుకునే సంస్కృతి క నువిందు చేస్తాయి. అయితే బీచ్ అందాలను చూసే భాగ్యం మన భా గ్యనగరo వాసులకు అనువంతైనా లేదంటే అతిశయోక్తి కాదు. అందు కు కారణం ప్రపంచంలోనే మెట్రోపా లిటన్ సిటీగా పేరుగాంచిన హైదరా బాద్ నగరంలో సముద్రం లేకపో వడమే అని చెప్పవచ్చు. దాంతో ఒకవేళ బీచ్ అందాల ఎంజాయ్ చే యాలనుకుంటే అంతో ఇంతో అం దుబాటులో ఉన్న బాపట్ల జిల్లాలో ని సూర్యలంకకు వెళ్లాల్సిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసు ల ఆకాంక్షలు సాక్షాత్కారం చేయాల న్న ఉద్దేశంతో ఇకపై హైదరాబాద్ లోనూ బీచ్ అందాలను చూసే అవ కాశం కల్పించాలని భావిస్తుంది. ఈ క్రమంలో కోత్వాల్ గూడ సమీపం లో బీచ్ అందాలు కనువిందు చే యబోతున్నట్లు అక్కడ ఓ భారీ ఆర్టి ఫిషియల్ బీచ్ ను నిర్మించడానికి తె లంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చే స్తోంది. దీనికి సంబంధించిన కసర త్తు ప్రారంభించడమే కాకుండా ప్ర ణాళికలను కూడా ఆవిష్కరించిం ది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి ప రిసరాలతో మానవ నిర్మిత సరస్సు ను ఏర్పాటు చేయనున్నారు.

ఇది హైదరాబాద్ ను ప్రపంచ స్థా యి పర్యాటక గమ్యస్థానంగా మా రుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద రూ.225 కోట్ల అంచ నా వ్యయంతో దీనిని నిర్మించబోతు న్నారు. అది కూడా ఈ డిసెంబర్ మాసం లోనే లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన కా ర్యాచరణ కూడా ప్రభుత్వం ప్రారం భించింది.

 

నిజమైన బీచ్ కు ఏమాత్రం తీసిపో ని విధంగా దీనిని నిర్మించనున్నా రు. స్టార్ హోటళ్ళు, అద్భుతమైన స్టే హోటళ్లు. అలలపై తేలియాడే వి ల్లాలు ఆకట్టుకోనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీ తాకాలపు క్రీడలు వంటి సాహస క్రీ డలు ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రా క్ లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చే సేలా ఉంటాయి. ఫుడ్ కోర్టులు, థి యేటర్లు, అలంకార ఫౌంటెన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉం డనున్నాయి. బీచ్ ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలనూ ఏర్పా టు చేయబోతున్నారు.

ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉం టుందని కొత్వాల్ గూడాను ఎంచు కున్నారు. ఏది ఏమైనా హైదరాబా ద్ ప్రజలతోపాటు సమీప జిల్లాల ప్రజలు విదేశీ పర్యాటకులు అంద రికీ ఇది ఒక శుభవార్తగా చెప్పుకో వచ్చు.