Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టి మేటం, వచ్చే రాష్ట్రావతరణ దినో త్సవం వరకు నల్లగొండ కొత్త కలెక్ట రేట్ భవనం నిర్మాణం పూర్తి చేయా లి
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ ను డిసెంబర్ లోగా మొ త్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శుక్ర వారం అయన పాత కలెక్టర్ కా ర్యా లయం వెనకవైపు నిర్మిస్తున్న నూత న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మా ణ పనులను ఆకస్మికంగా తనిఖీ చే శారు.
82 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో మూడు అంతస్తులతో నిర్మిస్తు న్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, జిల్లా కలెక్టర్ ,అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, మంత్రి ఛాంబర్, ఉండేలా ఏర్పాటు చేయాలని, పా త కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయా లని, ఇందుకుగాను పాత కలెక్టర్ కా ర్యాలయాన్ని పూర్తిగా ఆధునీకరిం చాలని ఆదేశాలు జారీ చేశారు. కొ త్త కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ ను ఫాల్ సీలింగ్,ఎల్ ఈడి స్క్రీన్లు, అన్ని సౌకర్యాలతో తో ని ర్మించాలని చెప్పారు.
కొత్త కలెక్టర్ కార్యాలయ భవన ని ర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితు లలో మార్చ కూడదని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను డి సెంబర్ నాటి కి పూర్తి చేసి ఇవ్వా లని, కార్యాలయ భవనం మొత్తా న్ని జూన్ 2 నాటికి పూర్తి చేసి అ ప్పగించాలని కాంట్రాక్టర్ ను ఆదే శించారు. భవన నిర్మాణ పనులు, నాణ్యత పై ప్రత్యేక దృష్టి నిలపాల ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కో రారు.
నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ ని ర్మాణం ఆయా జిల్లాలలో ఉన్న స మీకృత జిల్లా అధికారుల కార్యాల భవనాల కన్నా బాగుండాలని అ న్నారు. ఈ కార్యాలయం మొత్తం పూర్తి అయితే బయట ఉన్న డిఈ ఓ,డిఎంహెచ్ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకురావడం జరుగు తుందని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్టలపై ని ర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనుల పై ఆర్ అండ్ బి అధికారులతో స మీక్షించారు.
రెండు గుట్టలపై నిర్మి స్తున్న ఘాట్ రోడ్లకు సంబంధించి ఇప్పటివరకు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆ ర్ అండ్ బి అధి కారులు మంత్రికి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఘాట్ రోడ్ల నిర్మా ణాలను పూర్తిచే యాలని మంత్రి ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి, ఆర్ అండ్ బి సూపరింటిండెంట్ ఇంజనీర్ వెంక టేశ్వరరావు,ఆర్ అండ్ బి ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి , న ల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, కాం ట్రాక్టర్ రామ్ ప్రసాద్ ఇతర అధికా రులు తదితరులు ఉన్నారు.