Kavitha controversy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాంట్రవర్సీ కామెం ట్స్ కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ రచ్చకు దారితీసిన నేప ధ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత మరోసారి కుటుంబ సభ్యులపై చేసి న వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీ య దుమారం రేపుతోన్న వైనాన్ని క ళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వ రం నివేదికపై బిఆర్ఎస్ పై మూకు మ్మడి దాడికి దిగుతున్న క్రమంలో కవిత స్వపక్షంపై చేస్తున్న దాడి వెర సి కలవరం లేపుతోంది. దీంతో స్థా నిక ఎన్నికల ముందే తెలంగాణలో రాజకీయ రణరంగం ప్రారంభమైం దని చెప్పవచ్చు.
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చే సిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు తెలంగా ణ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న సంగతి స్పష్టంగా కనబ డుతుంది. ఈనేపథ్యలో కవితపై బీ ఆర్ఎస్ తీసుకోనున్న చర్యలు ఆస క్తికర చర్చ ఇప్పటికే ఊపందుకుం ది. కవిత వివాదాస్పద వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. క విత వ్యాఖ్యల క్రమంలోనే బీఆర్ ఎ స్ సామాజిక మాధ్యమాల్లో హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ మీడియా వా ట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆ ర్వోను బీఆర్ఎస్ తొలగించడం బి ఆర్ఎస్ వైఖరిని స్పష్టంచేస్తోంది.
ఈ నేపద్యంలో కవిత కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను స స్పెండ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న కథనాలు, ఊహాగానా లు కుంకునుపుంకాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కవిత కా మెంట్స్ క్రమంలో వెంటనే ఫాం హౌ స్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, మధుసూ దనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి తదితరులు అంతర్గత చర్చలతో స మావేశమైనట్లు విశ్వసనీయ సమా చారం. కవిత కాంట్రవర్సీ కామెంట్స్ పై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ని షితంగా చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది.
*నేడో రేపో కవితపై వేటు..?* నేడోరేపో కవితపై వేటు వేసేందుకే బిఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్న ట్లు తెలుస్తోంది. కవిత వివాదాస్ప ద వ్యాఖ్యలు శృతి మించిన నేప థ్యంలో ఆమెను ఏకంగా పార్టీ నుం చి సస్పెండ్ చేసే అవకాశం లేకపోలే దని బీఆర్ఎస్ వర్గాలు చెప్పకనే చె బుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత విష యంలో మరో కోణం కూడా తెరమీ దకి వస్తోందన్న చర్చ కూడా విస్తృ తంగా జరుగుతుంది. కవిత త్వర లో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉ న్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పార్టీ కోసం కవిత రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు విశ్వసనీయంగా వి నబడుతోoది.
*సస్పెండైన వెంటనే కొత్త పార్టీ ప్రకటన…?* గత కొంతకాలంగా ఎ మ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతుం దన్న ప్రచారానికి తాజా పరిణామా లు ఊతమిస్తున్నాయి. ఈ క్రమం లోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన వెంటనే కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీ య పరిశీలకులు ఇప్పటికే తమ అ భిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లి క్కర్ స్కాన్ కేసులో కవిత జైలు జీ వితం గడిపి బయటకొచ్చిన తర్వా త అప్ప ట్లోనే ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతారన్న వార్తలు దావా ణంలా వ్యాపించిన విషయం తెలి సిందే.అయితే ఆ వార్తలు అప్పటి అనుమానాలకు బలం చేకూర్చినా కార్యరూపంలోకి అడుగుపడలేదు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రచారానికి, తాజా కాంట్రవర్సీ కామెoట్లు బలం చేకూ రుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పా ర్టీ చివరకు ఏ విధంగా స్పందిస్తుం దో మరికొన్ని గంటలు వేచి చూడా ల్సిందే. ఏది ఏమైనా ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత తాజా వివాదాస్ప ద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీ య రచ్చకు దారితీసిందని చెప్పవ చ్చు.
BRS Party released a video on EXMinister Harish Rao pic.twitter.com/s0533P7mov
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 1, 2025