–టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి
TNJGO District President Nagilla Murali :
ప్రజా దీవెన, నల్లగొండ: సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పు నరుద్ధరించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగిల్ల మురళి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మే రకు సోమవారం ఉద్యోగులు,
ఉపాధ్యాయులు,పెన్షన్,కార్మికులు ఐక్యంగా నల్ల దుస్తులు ధరించి కలె క్టర్ కార్యాలయం ముందు నిర్వ హించిన ధర్నాలో పాల్గొని మాట్లా డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సి.పి.ఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించా లని పేర్కొన్నారు.
ఉద్యోగులు ఉద్యోగ జీవిత జీవి తాంతరం భద్రత కల్పించాలని ప్ర భుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వాటా ను గత ప్రభుత్వం నుండి జమ చే యకపోవడం దారుణం అన్నారు. ఉద్యోగులు సిపిఎస్ ద్వారా నష్ట పోతున్నారని, ఉద్యోగులు పెండింగ్ బిల్లులను అందజేయాలని అన్నా రు. హెల్త్ కార్డులను అమలు చేసి జీవో ఎమ్మెస్ నెంబర్317 బాధితు లను న్యాయం చేయాలని తెలిపా రు.
అనంతరం హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి సిపిఎస్ కు వ్యతిరే కం గా ఏర్పాటు చేసిన మీటింగ్ కు జి ల్లా నుండి ఉద్యోగులు పెద్ద సంఖ్య లో తరలి వెళ్లారు.ఈ కార్యక్రమం లో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి, జేఏసీ కో చైర్మైన్ వెంకటేశ్వర్లు, రాజశేఖర్, తరాల పరమేష్, అలీ మ్, వెంకులు, బిక్షమయ్య, జనా ర్దన్, సందీప్ రెడ్డి, చరిత రెడ్డి, అ లీం, కృష్ణమూర్తి, శ్రీశైలం, వెంకట్ రామ్ రెడ్డి, చేకూరి నరసింహ చా రి,రాంబాబు, ఆకునూరి లక్ష్మ య్య,వెంకట్ రెడ్డి, కత్తుల మనోజ్, ప్రదీప్, ప్రవీణ్, సైదులు, సత్య నా రాయణ, రవీందర్ రెడ్డి, లింగయ్య, నారాయణ స్వామి, కాశీం, మధు, మల్లికార్జున్, స్వామి నేతా, నరేష్, రాజశేఖర్, రణ దేవ్, ధారావత్ సైదులు, రమ్య సుధా, ఏడు కొం డలు, అజీమ్, శ్రీనివాస్, తదితర జేఏసి నాయకులు పాల్గొన్నారు.