–నిఘా నీడలో శోభాయాత్ర నిరం తర పర్యవేక్షణ
–950 మంది సిబ్బందితో శోభా యాత్రకు పటిష్ఠ బందోబస్తు
–జిల్లా వ్యాప్తంగా 5984 విగ్రహాల ఏర్పాటు
–శోభ యాత్ర సందర్భంగా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్
–నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈ త గాళ్ల ఏర్పాట్లు
–దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నిమజ్జన ప్రాంతాల పరిశీలన
— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda District SP Sharat Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5 వ తేదీ శుక్రవారం నిర్వహించే గణేష్ ని మ జ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావర ణంలో నిర్వహించేందుకు అన్ని శా ఖల సమన్వయంతో ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగ కుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏ ర్పాటు చర్యలు తీసుకుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో అజ్మాపూర్ మరియు దేవరకొండ లోకల్ లోని కొన్ని నిమజ్జన ప్రాంతా లనీ దేవరకొండ ఏఎస్పి మౌనిక, ఆ ర్డిఓ మరియు ఇతర శాఖ అధికారు లతో కలిసి పరిశీలించారు. భక్తుల కు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశిం చారు.
అనంతరం దేవరకొండ పోలీస్ స్టే ష న్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సి బ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థి తిగతులు వివరాలను స్థానిక సిఐ ని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్ హెచ్ ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీ లించి, తనిఖీ చేశారు.
అనంతరం స్టేషన్ పరిధిలో న మో దు అవుతున్న, నమోదైన కేసుల వి వరాలు,స్టేషన్ క్రైమ్ రికార్డ్, జనర ల్ రికార్డ్స్ లు తనిఖీ చేసి మాట్లా డుతూ కేసుల దర్యాప్తు విషయం లో అధికారులు అలసత్వం వహిం చవద్దన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా వారి పట్ల తక్ష ణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే వి ధంగా చూడాలన్నారు.
ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్ర కు పోలీస్ యంత్రాంగం శాంతియు తంగా నిర్వహించుటకు తీసుకున్న చర్యలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ గణేష్ శోభాయాత్ర జిల్లా లోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చే సిన కమ్యూనిటీ సీసీటివి కెమెరా ల తో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరా లను ఏర్పాటు చేసి,జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చే సి ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ నుంచి అధికారు లు నిరంతరం పర్యవేక్షించనున్నా రన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు, మండపాలకు జియో ట్యాగింగ్ చేసి తమకు కే టాయించిన నంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోనున్నారన్నారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలోని 9 అ డుగుల లోపు విగ్రహాలు నల్లగొండ పట్టణంలోని వల్లభ రావు చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది.9 అడుగులపై బడిన వి గ్ర హాలు 14వ మైలురాయి వద్ద నిమ జ్జనం ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. నిమజ్జనం సందర్భంగా ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ నిఘా పెట్టామని తెలి పారు.
*నిమజ్జన భద్రత కోసం 950 మంది సిబ్బంది*.. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పో లీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా ఎస్పీ పర్యవే క్షణలో ఒక ఏఎస్పీ , ఆడిషనల్ ఎ స్పీ, ఐదుగురు డీఎస్పీలు, 23 మం ది సీఐలు, 60 మంది ఎస్సైలు, 8 50 మందికి పైగా ఏఎస్ఐలు, కాని స్టేబుళ్లు, మహిళ కానిస్టేబుల్స్, హోంగార్డులు, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్, ఏ.ర్ సిబ్బంది స్పెషల్ పార్టీ తో కలిపి మొత్తం 950 బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.
*సిసిటివి కెమెరాల పర్యవేక్షణ లో శోభ యాత్ర* జిల్లాలోని పో లీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహ దారులు, నల్గొండ పట్టణంతో పా టు మిర్యాలగూడ మరియు దేవ రకొండ వంటి ప్రధాన పట్టణాలలో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ తరపు న నేను సైతం, కమ్యూనిటీ పోలీ సింగ్ ద్వారా మా ప్రాజెక్టు కింద ఏ ర్పాటు చేసిన సుమారు 1500 సీ సీటీవీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని అన్నారు.
*నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి*…జిల్లాలోని ప్రధాన నిమ జ్జ న ప్రాంతాలైన నల్గొండ పట్టణంలో ని వల్లభరావు చెర్వు, మూసి రివ ర్,14 వ మైలురాయి, మిర్యాల గూడ వాడపల్లి, నాగార్జునసాగ ర్,దయ్యాలగండి, అడవిదేవుల పల్లి, దేవరకొండ కొండబీమన ప ల్లి,డిండి వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి,పోలీసు పికెట్లు ప్లడ్ లైట్లు,క్రేన్లు , ఏర్పాటు చేశామని,నిమజ్జనం జరిగే ప్రాంతా ల్లో గజ ఈతగాళ్లను అందుబాటు లో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సం ఘటనలు జరగకుండా చర్యలు తీ సుకోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహ నాలు, బ్లూకోట్స్, సంబంధిత పో లీసు అధికారులు అప్రమత్తమ య్యేలా ఆన్లైన్ విధానంలో భద్ర తను పర్యవేక్షిస్తున్నారు.
*ట్రాఫిక్ అంతరాయం కలగ కుం డా ట్రాఫిక్ మళ్లింపు* …నిమజ్జనం రోజున జిల్లా కేంద్రంలోని ప్రజలకు, వాహనదారులకు శోభ యాత్ర సం దర్భంగా ట్రాఫిక్ అంతరాయం కల గకుండా శోభ యాత్ర నిర్వహించే మార్గం గుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏ ర్పాటు చేయడం జరిగింది. వి నా యక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభ యాత్రకు నిర్దేశించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహక రించాలి.
*శుక్రవారం రోజున పట్టణ కేంద్రం లోకి వచ్చే ప్రజలకు విజ్ఞప్తి*
— హలియా, దేవరకొండ నుంచే హైదరాబాద్ కు వెళ్ళే వాహనదారు లు జెఎం గౌడ్ క్రాస్ రోడ్డు, ఈద్గా వ యా మునుగోడు బైపాస్ ఐటీ హబ్ మీదుగా మళ్ళించనైనది.
–మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి, నకేరేకల్, నార్కట్ పల్లి మీదిగా హైద్రాబాద్ వై పు మళ్లించనైనది.
–హైద్రాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి నకి రేకల్ వయా తిప్పర్తి మీదుగా మి ర్యాలగూడ మళ్లించనైనది.
–హైదరాబాద్ నుంచి హలియ – దేవరకొండ కు వెళ్ళే వాహనదారు లు ఐటీ హబ్ మునుగోడు బై పాస్, ఈద్గా వయా, జెఎం గౌడ్ క్రాస్ రోడ్డు మీదిగా మళ్ళించనైనది.
–దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్ళే వాహనదారులు డి.ఈ.ఓ ఆ ఫీసు నుంచి మళ్లించడం జరిగింది.
*శోభయాత్రలో భక్తులు పా టిం చవలసిన నిబంధనలు*
–శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవె ర్షన్ ఉంటాయి.కాబట్టి ప్రజలు దా నికి అనుకూలంగా సిద్ధం కావాలి.
–గణపతి విగ్రహాల్ని తీసికొని వెళ్ళే వాహానాలను చెకప్ చేయించుకో వాలి
–మద్యం త్రాగి వాహనాలను న డుపరాదు. మద్యం త్రాగి వా హా నాలు నడిపే వారిపై ఆల్కామీటర్ పరీక్షలు జరుపబడును,మద్యం త్రా గివున్నట్లుయితే వారిపై చర్యలు తీ సుకొనబడును.
–డిజేలకు ఎట్టి పరిస్థితిలో అ ను మతి ఉండదు, ఉండబోదు టపా కాయలు కాల్చరాదు .
–మహిళలు , విలువైన వస్తువులు ధరించకుండా ఉంటే మేలు
–ఊరేగింపులో చిన్న పిల్లలు తప్పి పోయే అవకాశం ఉంటుంది . కా బట్టి తగు జాగ్రత్తలు తీసికోవాలి
–నిమజ్జనం జరిగే ప్రాంతంలో చెరు వుల, కాలవల వద్ద చిన్న పిల్లలు అనుమతించబడరు
–మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు, ఆకతాయిల పట్ల షి టీం బృందాలు నిఘా ఏర్పాటు
–ప్రజలు పోలీసులకు సహకరించి శోభాయాత్ర విజయవంతంగా పూ ర్తి అయేటట్లు చూడాలి
*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు* … జిల్లాలో గణేష్ ని మజ్జన శోభాయాత్ర ప్రశాంత వా తావరణంలో జరిగేలా అన్ని చర్య లు తీసుకున్నాం. ఇందుకోసం పో లీసు శాఖ ప్రత్యేకంగా నిర్వాహ కులకు ఇప్పటికే పలు సూచనలు తెలపడం జరిగింది. నిమజ్జనం సం దర్భంగా డీజే లు, సౌండ్ సిస్టం లు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. ముఖ్యంగా యువకులు నిమజ్జనం సమయం లో సంయమనం పాటించాలని అ న్నారు. ఎవరైనా నిబంధనలు అతి క్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శర త్ చంద్ర పవార్ హెచ్చరించారు.